విద్యార్థులకు జగన్ 35 లక్షల ల్యాప్ ట్యాప్ లు

Update: 2021-07-07 03:55 GMT
ఏపీలో విద్యావ్యవస్థను చక్కదిద్దిన జగన్ పాఠశాలల రూపు రేఖలు మార్చారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మఒడి కింద భారీ సాయం ప్రకటించారు. ఇక వారికి పుస్తకాల నుంచి యూనిఫామ్స్, షూల వరకు అన్నీ సమకూర్చారు. ఇప్పుడు కరోనాతో ఆగిపోయిన చదువులకు ప్రత్యామ్మాయంగా ఆన్ లైన్ క్లాసుల కోసం మరో వినూత్న ఆలోచన చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని 35 లక్షలకు పైగా విద్యార్థులు ఈ ఏడాది ల్యాప్ ట్యాప్ లు పొందబోతున్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన కార్యక్రమాల కింద డబ్బుకు ప్రత్యామ్మాయంగా ల్యాప్ ట్యాప్ లను సీఎం జగన్ అందించారు.

ఈ 35 లక్షల మంది విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన వారు కావడం విశేషం.  ఇప్పటిదాకా తరగతి గదుల్లో ల్యాప్ ట్యాప్ లకు ప్రవేశం లేదు. 1990-2000 మధ్యలో ఇంజనీరింగ్ ప్రారంభమైనా తొలుత అనుమతించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏపీలో విద్యార్థులు ల్యాప్ ట్యాప్ లను తరగతుల్లో పెట్టుకోవడానికి అనుమతిస్తున్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన వారున్నారు.ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతో వారు చదువుతున్నారు. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి, విద్యాదీవెన కార్యక్రమాల కింద నగదుకు ప్రత్యామ్మాయంగా రెండో సంవత్సరం నుంచి ల్యాప్ ట్యాప్ లను అందించేందుకు సిద్ధమైంది.

ఈ ల్యాప్ ట్యాప్ ల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు టాప్ బ్రాండెడ్ కంపెనీలకు నుంచి ఆర్డర్ ఇచ్చింది. అవి సిద్ధమైన తర్వాత లబ్ధిదారులైన విద్యార్థులకు అందజేస్తారు.

గ్రామీణ విద్యార్థులు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు సాధించేందుకు వారికి ల్యాప్ ట్యాప్ లు ఇస్తున్నామని జగన్ సర్కార్ చెబుతోంది.
Tags:    

Similar News