బ్రేకింగ్ : ఏపీలో 2 వేలు దాటిన పాజిటివ్ కేసులు!

Update: 2020-05-11 07:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఈ మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తుంది. గత రెండు వారాల్లో రోజూ 60 దాకా కేసులు నమోదవ్వగా... మూడ్రోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా 24 గంటల్లో 7409 శాంపిల్స్‌ని టెస్ట్ చెయ్యగా... 38 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2018కి చేరాయి. వీటిలో 998 కేసులు డిశ్చార్జి అయిపోయారు.

కాగా,ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 8, చిత్తూరు 9, గుంటూరు 5, కృష్ణా 3, కర్నూలు 9, నెల్లూరు 1, విశాఖలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం  115, చిత్తూరు  121, ఈస్ట్ గోదావరి 46, గుంటూరు 387, కడప 97, కృష్ణా 342, కర్నూలు 575, నెల్లూరు 102,  ప్రకాశం 63,  శ్రీకాకుళం  5, విశాఖపట్నం  66, విజయనగరం  4, వెస్ట్ గోదావరి 68, ఇతరులు  27 కేసులు ఉన్నాయి.

కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కాన్ఫిడెంట్‌ గా ఉంది. కరోనా టెస్టులు ఎక్కువగా  చేయడం వల్లే ..ఇంతలా పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి అని చెప్తుంది. దేశంలో ఎక్కువ టెస్టులు చేయిస్తున్నది ఏపీ ప్రభుత్వమే.
Tags:    

Similar News