కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ను రెండుగా విభజిస్తూ చేసిన చట్టం తరువాత అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు - ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకున్న ఆంక్షలు కొద్ది కొద్దిగా సడలిస్తున్నారు. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ను జమ్మూ కశ్మీర్ - లఢక్ గా విభజన చేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కల్పించారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కశ్మీర్ - లఢక్ లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పర్యటించే ప్రయత్నం చేసిన వారిని ప్రభుత్వం వారిని ఎయిర్ పోర్టుల నుంచే వెనక్కి పంపించింది. అయితే, పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చింది.. అజిత్ దోవల్ లాంటి కీలక అధికారులు కశ్మీర్ లో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. అక్కడ శాంతి నెలకొందని భావించిన సైన్యం వెంటనే అక్కడ ఆంక్షలు ఎత్తివేసింది. కశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేసినట్లుగా సమాచార - పౌర సంబంధాల అధికారులు ఓ ప్రకటన చేశారు. ఫోన్ ల్యాండ్ లైన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చినట్టు తెలిపారు.
కుప్వారా - హంద్వారాలో కూడా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ లు గణనీయంగా అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు అధికారులు. జమ్మూ కశ్మీర్ - లఢక్ ప్రాంతాల్లో అనేక చోట్ల ఆంక్షలను ఎత్తివేశామని... క్రమంగా ప్రజలు బయటకి రావడం దీంతో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగినట్టు అధికారులు చెపుతున్నారు. ఆంక్షలు విధించిన 39 రోజుల తర్వాత వాటిని ఎత్తివేసినట్టైంది. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రీనగర్ సహా జమ్మూ కశ్మీర్ లో ఆంక్షలు విధించారు. అంక్షలు ఎత్తివేయడంతో భవిష్యత్ లో జరుగబోయే పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి తరువాత జరిగే పరిణామాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.