బ్రేకింగ్ :39 మంది పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌రోనా!

Update: 2020-04-24 09:12 GMT
దేశంలో  కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. కరోనాను కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే, ఇటువంటి సమయంలో కూడా తమ ప్రాణాలని పనంగా పెట్టి .. వైద్యులు - పోలీసులు - పారిశుధ్య కార్మికులు - అధికారులు కరోనాను నియంత్రించాలని పోరాడుతున్నారు. అయితే , ఇప్పటికే కరోనా పేషేంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులకు ,కరోనా ను నియంత్రణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న పోలీసులకి , పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా సోకగా ..తాజాగా 39 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌ గా తేలింది.

ఈ ఘటన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో జరిగింది.  దీంతోప్రభుత్వం, అధికారులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. కరోనా పాజిటివ్ ‌గా తేలిన వారందరికీ పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌ కు తరలించారు. అయితే వారు ఎవరిని కలిశారో వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలను ప్రారంభించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకే 2376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. తాజా కేసులతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అ‍య్యింది. అలాగే కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక పిలుపునిచ్చారు.


Tags:    

Similar News