నిజమే.. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి ఒక ఈ మొయిల్ వచ్చింది. ఆ మొయిల్ ను రాసింది మూడో తరగతి చదువుతున్న ఓ చిన్న కుర్రాడు. తన సమస్యకు ప్రధానమంత్రి పరిష్కారం చూపాలన్న ఐడియా ఎలా వచ్చిందో కానీ.. ఆ కుర్రాడి మొయిల్ కు మాత్రం వెంటనే స్పందించారు.
కర్ణాటకకు చెందిన ఈ ఉదంతంలో బెంగళూరు మహానగరానికి చెందిన అభినవ్ అనే కుర్రాడు మూడో తరగతి చదువుతున్నాడు. తన ఇంటి నుంచి యశ్వంతపురలోని స్కూలుకు వెళ్లటానికి మూడు కిలో మీటర్లు దూరం మాత్రమే. అయితే.. రహదారి మధ్యలో ఫ్లైఓవర్ల నిర్మాణం.. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరుపుతున్న నిర్మాణం కారణంగానే ఆలస్యమవుతుందన్న విషయాన్ని గుర్తించాడు.
ఈ పనిలో సాగుతున్న జాప్యం కారణంగా.. మూడు కిలో మీటర్ల దూరానికి 45 నిమిషాల సమయం తీసుకుంటుందట. దీంతో.. ఆ కుర్రాడు తన సమస్యను వివరిస్తూ ప్రధానికి లేఖ రాశాడు. దీన్ని గుర్తించిన మోడీ కార్యాలయం.. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారట. మూడో తరగతి చదివే కుర్రాడి మొయిల్ కు దేశ ప్రధాని కార్యాలయం స్పందించటం మంచి పరిణామమే.