దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన నీట్ ఎగ్జామ్ పరీక్ష- లో దుస్తులను వదిలి రమ్మనే వివాదం అనూహ్య మలుపు తిరిగింది. నీట్ ఎగ్జామ్ నేపథ్యంలో కేరళ కన్నూరులోని ఓ పరీక్ష కేంద్రం వద్ద ఓ విద్యార్థినిని లో దుస్తులు తొలగించి లోపలికి రావాలన్న నలుగురు టీచర్లు సస్పెండ్ అయ్యారు. ఇలాంటి చర్యలు ఆహ్వానించదగినవి కాదని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ నెల 7న జరిగిన నీట్ ఎగ్జామ్ కు అధికారులు కఠిన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అయితే తిరువనంతపురంలోని కన్నూరులోని ఎగ్జామ్ సెంటర్ వద్ద మెటల్ డిటెక్టర్ తో తనిఖీ చేసిన టీచర్లు...ఓ విద్యార్థిని బ్రా ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ విద్యార్థినిని ఎగ్జామ్ సెంటర్లోకి టీచర్లు అనుమతించలేదు. లో దుస్తుల్ని తొలగించి రావాలంటూ పరీక్ష ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే తెలపడంతో ఆ విద్యార్థినికి వేరే మార్గం లేకపోయింది. అయితే ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం సంబంధిత టీచర్లను సస్పెండ్ చేసింది.