న‌ల్గొండ‌లో ఓపెన్ ట్రాలీలో రూ.40 కోట్లు!

Update: 2018-05-11 04:15 GMT
ఇవాల్టి రోజున వంద‌ల రూపాయిలకు సైతం క‌క్కుర్తి ప‌డుతున్న దుస్థితి. అలాంటిది ఏకంగా రూ.40 కోట్ల విలువైన కొత్త నోట్ల క‌ట్ట‌ల్ని ఎలాంటి భ‌ద్ర‌త లేకుండా ఓపెన్ ట్రాలీలో త‌ర‌లించ‌టం సాధ్య‌మేనా?  అంటే.. నో అంటే నో చెప్పేస్తారు. అయితే.. న‌ల్గొండకు చెందిన ఒక బ్యాంక్ అధికారులు అనుస‌రించిన వైనం షాకింగ్ గా మారింది.

న‌ల్గొండ జిల్లా కేంద్ర‌మైన న‌ల్గొండ‌కు చెందిన ఎస్ బీఐ ప్ర‌ధాన శాఖ ఎలాంటి భ‌ద్ర‌తా ఏర్పాట్లు తీసుకోకుండా ఓపెన్ ట్రాలీలో ఇంత భారీ మొత్తాన్ని త‌ర‌లించే ఏర్పాట్లు చేసింది. స‌రుకుల మూట‌లు ఏ విధంగా ట్రాలీలో వేస్తారో.. రూ.40 కోట్ల మొత్తాన్ని అదే రీతిలో ఓపెన్ ట్రాలీలో లోడ్ చేసిన వైనం సంచ‌ల‌నం సృష్టించింది.

దీనికి సంబంధించిన స‌మాచారాన్ని అందుకున్న పోలీసులు బ్యాంక్ వ‌ద్ద‌కు హుటాహుటిన చేరుకున్నారు. స‌రైన భ‌ద్ర‌త సిబ్బంది లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ఎలా త‌ర‌లిస్తార‌న్న ప్ర‌శ్న‌కు బ్యాంకు అధికారుల మాట మ‌రోలా ఉంది. తాము త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకునే ఓపెన్ ట్రాలీల న‌గ‌దు పంపుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

స‌ద‌రు బ్రాంచ్ మేనేజ‌ర్ మాట‌లే నిజ‌మైతే.. ఓపెన్ ట్రాలీలో నోట్ బుక్స్ బండిల్స్ పేర్చిన‌ట్లుగా ఎలా పేర్చార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీసం అవ‌న్నీ నోట్ల క‌ట్ట‌ల‌న్న విష‌యం తెలీకుండా ఉండేలా బాక్సుల్లో స‌ర్దేసినా బాగుండేది క‌దా? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

త‌మ సెక్యురిటీ సిబ్బందితో ఎస్ బీఐ నుంచి న‌ల్గొండ‌లోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌కు ఈ భారీ మొత్తాన్ని త‌ర‌లించిన‌ట్లుగా చెప్పారు. పోలీసులు ద‌గ్గ‌ర ఉండి మ‌రీ ఈ మొత్తాన్ని స‌ద‌రు బ్యాంకుకు పంప‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News