సరిగ్గా నలభై ఏళ్ల కిందట... 1975 జూన్ 25న స్వతంత్ర భారతదేశం ఒక్కసారిగా చీకట్లో మునిగిపోయింది.. ఎటుచూసినా చిమ్మచీకటి... చీకటికి ఏమాత్రం భ'యపడకుండా బయటికి రావాలని ప్రయత్నించివారిని విషనాగులు కాటేశాయి... వెలుతురు లేని లోకంలో చూసీచూడకుండా నడవడంతో అగాధాలు బలి తీసుకున్నాయి.. దాంతో చీకటి ఎంత భ'యంకరమైనదో అందరికీ అర్థమైంది... అలాంటి చీకటి ఇంకెన్నడూ రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఆ చీకట్లో ఎదురుదెబ్బలను తట్టుకుని ముందుకుసాగినవారు ఇప్పటికీ ఉన్నారు.... ఆ చీకటి ఛాయలు ఏమాత్రమూ తెలియని కోట్ల మంది యువతరమూ ఉంది... ఆ చీకటి ప్రకృతి సహజమైన చీకటి కాదు.. నిరంకుశం నెత్తికెక్కి ప్రజల నెత్తిన రుద్దిన చీకటి... అత్యయిక స్థితి అని పిలిచే అంధకారం.. ఎమర్జెన్సీ అనే చీకటి రోజు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నలభై ఏళ్లయిన సందర్భంగా తుపాకీ ప్రత్యేక కథనం..
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలని నిర్ణయించారు. ఆమె నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఆ రోజు రాత్రి సమావేశమై ఈ భ'యంకరమైన నిర్ణయాన్ని తీసుకుంది. మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన ఆర్డినెన్సుపై అప్పటి రాష్టప్రతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ సంతకం చేశారు... అది కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా... నిమిషం గడిస్తే కొత్త తేదీ వచ్చేస్తుందేమో.... ఏ నిమి'ానికి ఏమి జరుగుతుందో అన్నంత తొందరగా జూన్ 25 అర్ధరాత్రి 12 గంటలకు కొద్ది నిమి'ాల ముందు సంతకం చేశారు. ప్రసార సాధానాల వ్యాప్తి అంతంతమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో ఆ వార్త ఉదయం 6 గంటలకు ఆలిండియా రేడియోలో ప్రసారమైన ఆంగ్ల వార్తలతో దేశమంతటికీ తెలిసిపోయింది. అప్పటికి భారతదేశానికి ఎమర్జెన్సీ అంటే ఏమిటో కూడా తెలియదు.. కొందరు సైనిక ప్రభ'ుత్వం అనుకున్నారు... కొందరు రాజకీయ కుట్ర అనుకున్నారు.... పొరుగుదేశం యుద్ధానికి వస్తుందనుకున్నారు... పైనుంచి బాంబులు పడతాయేమో అని భ'యపడ్డారు.. అయితే.. ఎమర్జెన్సీ అంటే అంతకంటే భ'యంకరమైనదని వారికి కొద్ది గంటల్లోనే అర్ధమైపోయింది. దీని కంటే ఏ పరాయి దేశమో పైనుంచి బాంబేసి చంపేస్తే నయమన్నంత నరక యాతన అనుభ'వించారు.
ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తున్నారన్న కారణంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాజకీయ నాయకులను జైల్లలో ఉంచారు. పత్రికా వార్తలపై సెన్సార్ షిప్ విధించారు. ఏం రాయాలి... ఏం రాయకూడదన్నది చెప్పేవారు... చివరగా ఉన్నతస్థాయి ప్రభ'ుత్వాధికారులు చూసి ఓకే అన్నతరువాతే ముద్రించేవారు. ఎక్కడైనా ఒక్క అక్షరం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉంటే పనైపోయినట్లే. అయితే ఈ నిరంకుశానికి నిరసనగా అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తన ఎడిటోరియల్ ప్రచురించే స్పేస్ ను ఖాళీగా ఉంచేసేది. దాంతో చాలా పత్రికలు ఆ మార్గాన్ని అనుసరించాయి.
ఎమర్జెన్సీ సమయంలో దేశం అట్టుడికి పోయింది. అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కమాటలో చెప్పాలంటే దమన కాండ సాగింది. ప్రసార మాధ్యమాలపైనా ఆంక్షలు ఉండడంతో ప్రజలకు వాస్తవాలు తెలిసేవి కావు. అయితే అప్పటికి కాంగ్రెస్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితి కొంత నయంగా ఉండేది. ఉత్తర భారతంలోనైతే అరాచకాలకు అంతేలేదు... మగాళ్లను పట్టుకుని నిర్భంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేశారు.. ఇళ్లు కాల్చేయడం.. కూల్చేయడం వంటి దారుణాలకు లెక్కేలేదు.
ఎమర్జెన్సీ ఎందుకొచ్చింది...?
అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నాటి సోవియట్ యూనియన్ తాష్కెంట్ లో ఆకస్మికంగా మరణించడంతో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధి ప్రధాని అయిన సంగతి తెలిసిందే. మొరార్జీ దేశాయ్ వంటి కాకలు తీరిన కాంగ్రెస్ అగ్రనేతలు తమకు ఇష్టం లేకపోయినా ఆమె కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 1969 లో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువుగా చీలిపోయింది. అయినా ఇందిరా తనదే పైచేయి అనిపించుకుంది. 1971 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధి గరీభీ హఠావో నినాదం ఎత్తుకుని తన కాంగ్రెస్ (ఆర్)కు గెలుపు సాధించి పెట్టింది. మొత్తం లోకసభ'లోని 518 సీట్లలో 352 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించారు. ఆ ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) విమోచన యుద్ధంలో సాధిం చిన విజయం ఆమెను మరింత బలవంతురాలిగా మార్చింది. దేశమంతా ఆమెను కీర్తించడం మొదలుపెట్టేసరికి ఆమె పూర్తిగా మారిపోయారు. అధికారం మొత్తం తన చెప్పుచేతల్లోకి తీసుకునే ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. తనకు అడ్డువచ్చే కాంగ్రెస్ శక్తుల్ని అడ్డు తొలగించుకోవడం కూడా ఇందిరా గాంధి వ్యూహాల్లో భాగం. ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ గా వున్న పీ.ఎన్. హక్సర్ తోడుగా నిలిచారు. అంతవరకూ ప్రభ'ుత్వాధి కారులకి రాజకీయనాయకుల పట్ల ప్రత్యేకించి వ్యక్తిగత అభిమానాలు వుండేవి కావు. హక్సర్ ఆ సంస్కృతికి మంగళం పాడి ఇందిరా గాంధీకి వ్యక్తిగతంగా విధేయు లుగా వుండే అధికారులని ఎంపిక చేసి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఆ విష సంస్కృతి ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర అంటూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బారువా పొగిడే స్థాయికి భ'జన బృందాలు ఎదిగిపోయాయి. అయితే... దీనికి రాజ్ నారాయణ్ అనే సోషలిష్టు నేత అడ్డుకట్ట వేశారు. ఇందిరపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ ఆ ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేశారు. అధికార దుర్వినియోగం చేసి ఇందిర గెలిచిందని వాదించారు. ఇప్పుడు ప్రముఖ న్యాయవాదిగా వున్న శాంతి భ'ూషణ్ అప్పుడు రాజ్ నారాయణ్ తరపున కేసు వాదించారు. ఇందిరాగాంధీ ఎన్నికల సభ'లకు పోలీసులు వేదికలు నిర్మిం చారనీ, యశ్ పాల్ కపూర్ అనే ప్రభ'ుత్వ ఉద్యోగి సేవలను ప్రధాని ఎన్నికల సమ యంలో వాడుకున్నారని అభియోగాలు మోపారు. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద వస్తున్న ఆరోపణలతో పోలిస్తే ఇవన్నీ చిన్నవే... కానీ, అప్పటి అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ సినాÛ సీరియస్ గా పరిగణించారు. 1975 జూన్ 12 వతేదీన చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఇందిరా ఎన్నిక చెల్లదని కొట్టివేశారు. ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించారు. అంతే కాదు ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇంది రాగాంధీపై నిషేధం విధించారు. అలహాబాదు హైకోర్టు తీర్పు రాజకీయంగా పెనుతుపాను సృష్టించింది.
లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో యావత్ పతిపక్ష నాయ కులందరూ ఇందిర రాజీనామా చేయాలని పట్టుబట్టారు. వారికి మద్దతుగా విద్యార్ధులు ఆందోళనలతో వీధుల్లోకి దిగారు. అలహాబాదు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రధాని ఇందిర సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అక్కడా ఆమెకు చుక్కెదురయింది. కేసు విచారిం చిన జస్టిస్ వీ.ఆర్. కృష్ణయ్యర్, జూన్ 24న కింది కోర్టు తీర్పును సమ ర్ధిస్తూ ఉత్త ర్వులు ఇవ్వడంతో ఇందిరాగాంధీకి అన్ని దారులూ మూసుకుపో యాయి. కృష్ణయ్యర్ మరింత తీవ్రమైన తీర్పు ఇచ్చారు. పార్ల మెంటు సభ'ు్యరాలిగా ఇందిరాగాంధీ అనుభ'విస్తున్న అన్ని ప్రత్యేక సౌకర్యాలనూ ఆయన రద్దు చేసారు. అంతే కాదు ఎన్నికల్లో ఓటేసే హక్కునూ రద్దు చేశారు. ఇవన్నీ చేసినా ఆయన ప్రధాని పదవిలో కొనసాగేందుకు ఏమీ అభ'్యంతరం లేదని తీర్పిచ్చారు.
దీంతో జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరకు ప్రధానిగా కొనసాగే హక్కు లేదని.. ఏ అధికారీ ఆమె ఆదేశాలు పాటించరాదంటూ పిలుపునిచ్చారు. ఆ తరువాత ఇందిర ఎమర్జెన్సీ విధించడానికి నిర్ణయించుకుని రాష్ట్రపతిని కలిశారు. ఎమర్జెన్సీ ముసాయిదాను అర్ధరాత్రి రాష్టప్రతి ఆమోదం కోసం రాష్టప్రతి భ'వన్ కు పంపారు. పన్నెండు గంటలు కొట్టడానికి కొన్ని నిమి'ాలు ముందు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ దానిపై సంతకం చేశారు. అయితే... ఆ రోజు మధ్యాహ్నమే దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నేతలను అరెస్టు చేశారు.
సంజయ్ గాంధీ దారుణాలు..
ఎమర్జెన్సీ ప్రకటనతో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన కొన్ని ప్రాధమిక హక్కులకు భ'ంగం వాటిల్లింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభ'ుత్వపరంగా సాగిన దాష్టీకం ఉత్తర భారతంలోనే ఎక్కువగా ఉండేది. దక్షిణ భారతంలో దాని ప్రభావం తక్కువే. ఇందిర రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలో రాజ్యాంగేతర శక్తిగా మారాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఆయన ఆడించినట్లు ఆడేవారు.
మూడు సార్లు ఎమర్జెన్సీ..
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మూడుసార్లు ఎమర్జెన్సీ విధించారు. 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు భారత్ చైనాల మధ్య యుద్ధం కారణంగా ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధించారు. అలాగే, 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు పాకిస్థాన్ తో యుద్ధం విదేశీ దురాక్రమణ బెదిరింపు కారణంగా ఎమర్జెన్సీ విధించారు. ఇవన్నీ ఇతర దేశాల నుంచివచ్చే ప్రమాదాన్నుంచి ప్రజలను రక్షించుకోవడానికి విధించిన ఎమర్జెన్సీలు కాగా... మూడో సారి ఇందిరాగాంధి హయాములో దేశ భ'ద్రతను, ఆంతరంగిక కల్లోలాలను బూచిగాచూపించి 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ పేరుతొ ఇందిరాగాంధీ తాత్కాలికంగా కొన్నాళ్ళు అధికారంలో కొనసాగి వుండవచ్చు కాని, అంతకు పూర్వం ఆమె సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ మసకబారాయి. ఆ తరువాత ఆమే తప్పు అర్థం చేసుకుని ఎమర్జెన్సీ ఎత్తి వేసారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పచ్చ జెండా చూపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇందిరను ఓడించ డానికి పార్టీలన్నీ ఏకమై, ఒకే పేరుతొ, ఒకే ఎన్నికల గుర్తుతో బరిలోకి దిగాయి. జనత పార్టీ రూపంలో పెల్లుబికిన జనాభిప్రాయం ఇందిరకు ఘోర పరాజయాన్ని మిగిల్చింది.
ఇక ఇందిరను ఓడించి అధికారానికి వచ్చిన జనత పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రయ్యారు. స్వాతంత్య్రానంతరం మొట్టమొదటి కాంగ్రెసేతర కేంద్ర ప్రభ'ుత్వం ఏర్పడింది. అయితే.. రాజకీయ స్వలాభాలకోసం చేతులు కలిపిన వివిధ పార్టీలన్నీ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాయి. ఫలితం రాజకీయంగా పూర్తిగా మసకబారిన ఇందిరాగాంధీకి రాజకీయ పునర్జన్మ లభించింది. ముక్కలు చెక్కలయిన జనతా పార్టీని ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మట్టి కరిపించారు. మళ్లీ ప్రధాని అయిన తరువాత ఇంది రాగాంధీలో బాగా మారిపోయారు. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పారు. కానీ.. పదవిలో పూర్తికాలం ఉండకముందే అంగరక్షకుల చేతిలో హతమయ్యారు.
ఎమర్జెన్సీలో పాజిటివ్ యాంగిల్..!
ఎమర్జెన్సీ కాలంలో ప్రభ'ుత్వ కార్యాలయాల్లో లంచం అడగడానికీ, తీసుకోవడానికీ భ'యపడిపోయేవాళ్ళు. ఫైళ్ళు చకచకా కదిలేవి. తెల్లవారుతూనే రోడ్లు శుభ్ర'ంగా ఊడ్చేవాళ్ళు. రోడ్డుపక్కన మూత్రవిసర్జన అనేది కనిపించేది కాదు. మొదట్లో ధరలు దిగివచ్చాయి. అయితే కొద్ది కాలానికి ఈ భ'యమంతా పోయి ఎమర్జెన్సీలోనూ మామూలు పరిస్తితులే వచ్చేశాయి.. ఆలోగా ఏకంగా ఎమర్జెన్సీ కూడా ఎత్తేశారు.
..... గరుడ