కశ్మీర్ కు 400 స్టార్టప్ లు.. మోడీ దెబ్బకు మొత్తం మారిపోయింది..

Update: 2022-12-29 16:30 GMT
మోడీ వచ్చాక దేశ భద్రత పూర్తిగా మారింది. సైన్యానికి కొత్త శక్తి వచ్చింది. ముఖ్యంగా జాతీయ భావాలు ఇనుమడిస్తున్నాయి.  దేశ భ్రదత విషయంలో మడమతిప్పని రాజకీయం చేస్తున్నాడు మోడీ. భారతసైనికులను చంపిన ఉగ్రవాదులను హతమార్చడానికి ఏకంగా శత్రుదేశం పాకిస్తాన్ పై వైమానిక దాడి చేయించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇన్నాళ్లు శాంతికాముక దేశంగా ఉన్న భారత్ పంథాను మార్చిన ఘనత మోడీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా జమ్మూకశ్మీర్ విషయంలో మోడీ వేసిన అడుగులు దేశ చరిత్రను మలుపుతిప్పాయి. అసలు భారత జెండా ఎగురని ఆ రాష్ట్రాన్ని విభజించి దేశంలో విలీనం చేసి ఆర్టికల్ 370డి రద్దు చేసి స్వేచ్ఛను కల్పించిన మోడీ చర్యను పాకిస్తాన్ చైనా సహా ఇతరులు ఖండించినా మన దేశంలో మాత్రం జయజయద్వానాలే దక్కాయి. జమ్మూకశ్మీర్ ను దేశంలో అంతర్భాగం చేసిన మోడీజీ అక్కడితే దాన్ని ముగించలేదు. ఆయన చేస్తున్న అభివృద్ధి ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి.

జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న మార్పులు ఇప్పుడు ప్రపంచానికి ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇంతకుముందు కాశ్మీర్ అంటే ఒక వివాదాస్పద ప్రాంతంగా ఉండేది. ప్రపంచ భాషలో చెప్పాలంటే ఒక కల్లోలిత ప్రాంతం. భారత్ వెళ్లి కశ్మీర్ ను ఆక్రమించుకోవడం వల్ల  ఆ ప్రాంతంలోని ప్రజలు తిరగబడుతున్నారంటూ 70 ఏళ్ల పాటు ప్రపంచాన్ని నమ్మించింది పాకిస్తాన్. జరిగే ప్రతీ విధ్వంసం వెనుకున్నది పాకిస్తాన్. కానీ అది ప్రపంచానికి ఏం చెబుతుందంటే.. కశ్మీర్ లో అమాయకులైన పౌరులు, స్వతంత్య్రకారులను చంపేస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తప్పుదోవ పట్టిస్తోంది.

జమ్మూకశ్మీర్ లోని 40 శాతం భూభాగాన్ని ఇప్పటికే ఆక్రమించేసిన పాకిస్తాన్  అక్కడి ప్రజలకు ప్రధానమంత్రిని కూడా పెట్టామని సుధీర్ఘకాలంగా ఒక నాటకాలు ఆడుతోంది. అదంతా తెలిసినా కూడా పాకిస్తాన్ కు వెనుకాల నుంచి ప్రపంచ దేశాలు అండగా నిలబడ్డాయి. ఎందుకంటే అది అమెరికన్ బ్యాచ్ కాబట్టి. ఇటు భారతదేశం రష్యాతో అనాధిగా సాన్నిహిత్యంతో ఉన్నాం కాబట్టి అమెరికాకు శత్రువుగా మారిపోయాం. ఇక రష్యా కూడా సైనిక సాయం తప్పితే పెద్దగా భారత్ కు సపోర్టుగా నిలిచింది ఏమీ లేదు. మనం ఎప్పుడూ గొడవల్లో ఉంటూ పెద్దమనిషిలా వ్యవహరించలేదు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకే కశ్మీర్ రగులుతూనే ఉంది.

కానీ మోడీ వచ్చాక ఇప్పుడు అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేసి.. భారత రాజ్యాంగం అమలు చేయడం మొదలుపెట్టారో అప్పుడే అంతా మారిపోయింది. ఇండియన్ పోలీసులే అక్కడి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం.. కశ్మీరీలనే పోలీసులుగా ఎంపిక చేయడం.. కశ్మీరీలకు భారతదేశం మనది అన్న ఫీలింగ్ ను కలిగించడంలో మోడీ సక్సెస్ అయ్యారు. భారతీయులకు కూడా కశ్మీర్ మనది అన్న ఫీలింగ్ కలిగించడంలో మోడీ సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు మోడీ కశ్మీర్ లో అభివృద్ధి చేస్తుండడంతో కోట్లాదిమంది భారతీయులు అక్కడికి పర్యాటనకు పోటెత్తుతున్నారు. విద్య, ఉద్యోగా, ఉపాధి అవకాశాలు అక్కడ కల్పిస్తున్నారు. భారత్ లోని అనేకమంది కశ్మీర్ కు వెళ్లి అక్కడ పనులు చేసుకుంటుండడంతో అది భారత్ లో అంతర్బాగంగా మారిపోయింది. అక్కడున్న వారికి తమది భారత్ అన్న భరోసా వచ్చింది.

ఇక ఏకంగా కశ్మీర్ లో 400 స్టార్టప్ లు పనులు ప్రారంభించడం సంచలనమైంది. స్విగ్గి, జమోటా , ఓలా లాంటి సర్వీసెస్ దాదాపు 400 కశ్మీర్ లో ప్రారంభించారు. అక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇది అత్యంత సంచలనమైన విప్లవాత్మక మార్పుగా చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News