అంచనాల‌కు అంద‌నంత పురాత‌న ర‌థమ‌ట‌!

Update: 2018-06-06 11:05 GMT
అధికారులు నిర్వ‌హించే త‌వ్వ‌కాల్లోనూ.. అప్పుడ‌ప్పుడు అనుకోకుండా బ‌య‌ట‌ప‌డే పురాత‌న వ‌స్తువుల గురించి తెలుసు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో బ‌య‌ట‌ప‌డిన పురాత‌న ర‌థం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే.. ఇది ఎన్ని వేల సంవ‌త్స‌రాల క్రితానికి చెందిన ర‌థ‌మో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన నాగ‌రిక‌త‌ల‌కు మించి.. స‌రికొత్త అధ్య‌యానికి ప‌నికొచ్చే ముడిస‌రుకుగా ఈ పురాత‌న ర‌థాన్ని చెప్పాలి.  ఈ ర‌థం త‌యారు చేసిన కాలం ఇప్ప‌టికే సంచ‌ల‌నంగా మారితే.. ఈ ర‌థం త‌యారుచేసిన వైనం చూస్తున్న నిపుణుల‌కు నోట మాట రాని ప‌రిస్థితి. ఇంత‌కూ స‌ద‌రు ర‌థం ఏకాలంలో త‌యారు చేశారో తెలుసా?  సుమారు నాలుగువేళ ఏళ్ల కింద‌టిదిగా భావిస్తున్నారు.

పురాత‌త్త్వ శాస్త్ర‌వేత్తల లెక్క ప్ర‌కారం క్రీస్తుపూర్వం 2000 నుంచి క్రీస్తు పూర్వం 1500 మ‌ధ్య‌కాలంలో వాడిన‌ట్లుగా భావిస్తున్న ఈ లోహ ర‌థం యూపీలోని బాఘ్ ప‌ట్ లో బ‌య‌ట‌ప‌డింది. ఈ ర‌థానికి ఉన్న ర‌థ చ‌క్రాల‌కు రెండు వైపులా సూర్యుడికి చెందిన చిహ్నాలు ఉండ‌టం విశేషం. గ‌డిచిన మూడు నెల‌లుగా అధికారులు జ‌రుపుతున్న త‌వ్వ‌కాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ క‌త్తులు.. పిడిబాకులు.. ఆభ‌ర‌ణాలు లాంటివెన్నో బ‌య‌ట‌ప‌డ్డాయి.

తాజాగా బ‌య‌ట‌ప‌డిన ర‌థం ఏజ్ చూసిన త‌ర్వాత ఇప్ప‌టికే అంద‌రికి సుప‌రిచిత‌మైన హ‌ర‌ప్పా.. మొహెంజ‌దారో.. ధోల‌వీర నాగ‌రిక‌త‌తో పోలిస్తే.. బాప్ ఘాట్ నాగ‌రిక‌త చాలా భిన్నంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ ర‌థం ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. దీన్ని పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేస్తే.. చ‌రిత్ర‌కు సంబంధించిన స‌రికొత్త చ‌రిత్ర తెర మీద‌కు రావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News