కరోనా వైరస్ దేశంలో పంజా విసురుతున్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఘటన వెలుగులోకి రాకముందు దేశంలో కరోనా కట్టడిలోనే ఉంది అని అందరూ అంచనా వేశారు. కానీ, ఆ తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఇకపోతే , తెలంగాణలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తుంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు.. ఇందులో ఒకరు షాద్ నగర్ కి చెందిన వారు కాగా, మరొకరు సికింద్రాబాద్ కి చెందినవారు. ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229 కి చేరింది. ఇకపొతే రాష్ట్రంలో మృతుల సంఖ్య 11 కి చేరింది. రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చింది అని అనుకుంటున్న సమయంలో ...ఇలా ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడానికి కారణం ఢిల్లీ ఘటనే.
అయితే , ఈ ఢిల్లీ ఘటన పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఢిల్లీ కి వెళ్లి వచ్చిన వారందరిని గుర్తించి , వారందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తుంది. కరోనా సోకినా వారిన ఐసోలేషన్ కు , కరోనా నెగటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలిస్తుంది. తబ్లీగి జమాత్ కు తెలంగాణ నుండి 1030 మంది ఢిల్లీ వెళ్లి రాగ... అందులో 171 మంది విమానాల్లో , మిగిలిన వారు రైళ్లలో వచ్ఝినట్టు గుర్తించారు.ఈ లెక్క ప్రకారం ..మార్చి 13 నుండి 17 మధ్య తబ్లీగిలతో కలిసి 42 వేలమంది ప్రయాణించినట్లు తేలింది. అయితే , వీరు ఢిల్లీ నుండి వచ్చి రెండు వారాలు పూర్తి కావడంతో ఎక్కువ ముప్పు ఉండదని భావిస్తున్నారు.