తెలంగాణ‌లో ఎయిడ్స్ విజృంభ‌ణ‌..పెరిగిన మ‌ర‌ణాలు!

Update: 2020-02-23 03:30 GMT
ఒక‌వైపు ప్ర‌జ‌లు అవ‌గాహ‌న వంతులు అవుతున్నారు.. ఎయిడ్స్ క్ర‌మంగా త‌గ్గిపోతోంద‌నే అభిప్రాయాలు అంత‌టా ఏర్ప‌డుతూ ఉన్నాయి. అసుర‌క్షిత లైంగిక కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉండ‌టం, సుర‌క్షిత చ‌ర్య‌లు తీసుకోవ‌డం.. అలాగే హెచ్ఐవీ సోకినా, మందులు వాడ‌టం.. ద్వారా ఆ వ్యాధి గ్ర‌స్తులు త‌మ‌ను తాము ర‌క్షించుకుంటున్న‌ట్టుగా ఉన్నారు. అయితే ఉన్న‌ట్టుండి తెలంగాణ లో ఎయిడ్స్ మ‌ర‌ణాలు పెరిగాయ‌నే నివేదిక ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. దేశ వ్యాప్తంగా గ‌త ఏడాది చోటు చేసుకున్న ఎయిడ్స్ మ‌ర‌ణాల గురించి కేంద్ర ప్ర‌భుత్వం నివేదిక ఇచ్చింది.

దాని ప్ర‌కారం.. ఎయిడ్స్ మ‌ర‌ణాల్లో తెలంగాణ టాప్ ఫోర్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. చిన్న రాష్ట్ర‌మే అయినా పెద్ద రాష్ట్రాల‌కు ధీటుగా తెలంగాణ‌లో ఎయిడ్స్ మ‌ర‌ణాలు చోటు చేసుకున్న‌ట్టుగా కేంద్రం నివేదిక చెబుతూ ఉంది. తెలంగాణ‌లో గ‌త ఏడాదిలో 4,250 మంది ఎయిడ్స్ వ్యాధితో మ‌ర‌ణించార‌ని ఆ నివేదిక‌లో పేర్కొన్నారు. అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే ఎయిడ్స్ కార‌క మ‌ర‌ణాలు 32 శాతం పెరిగాయి ఆ రాష్ట్రంలో అని కూడా కేంద్ర నివేదిక పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈ నివేదిక‌లో మొద‌టి స్థానంలో నిలిచింది మ‌హారాష్ట్ర‌. అక్క‌డ 2019లో 7,778 మంది ఎయిడ్స్ తో మ‌ర‌ణించార‌ట‌. దేశ వ్యాప్తంగా 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో 43,019 మంది ఎయిడ్స్ తో మ‌ర‌ణించిన‌ట్టుగా ఈ నివేదిక‌లో పేర్కొన్నారు. అంతుకు ముందు ఏడాదితో పోలిస్తే ఎయిడ్స్ కార‌క మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుద‌ల న‌మోదు అయిన‌ట్టుగా కూడా అందులో వివ‌రించారు. అంతుకు ముందు ఏడాది 51,911 మంది ఎయిడ్స్ తో చ‌నిపోయార‌ట దేశం మొత్తం మీద‌. గ‌త ఏడాదిలో ఆ సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. కానీ తెలంగాణ‌లోనే ఆ సంఖ్య పెరిగిన‌ట్టుగా ఈ నివేదిక‌లో పేర్కొన్నారు.

ఎయిడ్స్ తో మ‌ర‌ణించిన వారిలో ప్ర‌ధానంగా సెక్స్ వ‌ర్క‌ర్లే ఉన్నార‌ని, ఆ త‌ర్వాత వ‌ల‌స కార్మికుల్లో ఈ వ్యాధి ప్ర‌భావం క‌నిపించింద‌ని కూడా ఆ నివేదిక‌లో వివ‌రించారు.
Tags:    

Similar News