పాము కాటేస్తే 4.26 లక్షల బిల్లా?

Update: 2016-05-21 06:19 GMT
ఏదైనా జబ్బు వస్తే ఓ వ్యక్తి ఒల్లు గుల్లవుతుందో లేదో కానీ.. ఆ జబ్బుకు చికిత్స చేయించుకోవడం కోసం ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే మాత్రం ఇల్లు మొత్తం గుల్లవడం ఖాయం. అందులోనూ అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కు వెళ్లామో అంతే సంగతులు. ఇక్కడ ఓ కుర్రాడికి పాము కాటేసిందని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌ కు తీసుకెళ్తే పది రోజులు చికిత్స చేసి రూ.4.26 లక్షల బిల్లు వేసి పంపిన వైనం చూడండి.

గత నెలలో పాము కాటేసిందని సృజన్ అనే 17 ఏళ్ల కుర్రాడిని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 12 రోజుల పాటు ఐసీయూలో ఉంచి అతడికి చికిత్స చేయించారు. ఆ పన్నెండు రోజులకు ఐసీయూ ఛార్జీలు మాత్రమే రూ.78 వేలు అయ్యాయి. ఇక రూం ఛార్జీలని రూ.22,800 కోత పడింది. కన్సల్టేషన్.. డాక్టర్ రౌండ్స్ ఛార్జీల పేరిట రూ.20 వేలు వేశారు. ఇవన్నీ ఓకే కానీ.. పాము కాటుకు మందులంటూ 2 లక్షల రూపాయల బిల్లు వేయడమే అన్నిటికన్నా విడ్డూరం. ఇన్వెస్టిగేషన్ ఛార్జీల పేరుతో ఇంకో లక్ష రూపాయలు వాయించారు. వెంటిలేటర్ ఛార్జీలంటూ రూ.40 వేలు.. ఇన్ స్ట్రుమెంట్ ఛార్జీలంటూ రూ.30 వేలు. బ్లడ్ ఛార్జీలంటూ రూ.20 వేలు.. ఆల్ఫా బెడ్ ఛార్జీలంటూ ఇంకో రూ.6 వేలు.. ఇలా ఎంతగా వాయించాలో అంతా వాయించారు.

మందులకు.. ఇన్వెస్టిగేషన్ ఛార్జీల పేరుతో 2 లక్షలకు.. లక్షకు రౌండ్ ఫిగర్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ అబ్బాయిని కరిచింది ఎంత విషపూరితమైన పామైనా కావచ్చు.. మరీ పాము కాటుకు ఇంత ఖరీదైన చికిత్స అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రాణం ఖరీదు ముందు ఈ ఖర్చు చిన్నదే కావచ్చు.. కానీ మిడిల్ క్లాస్ జనాలు మాత్రం అత్యవసర పరిస్థితుల్లో తొందరపడి కార్పొరేట్ హాస్పిటల్ల గడప తొక్కితే అంతే సంగతులనడానికి ఈ బిల్ రుజువు. కమెడియన్ వెన్నెల కిషోర్ కు ఎవరో ఈ బిల్లు తాలూకు పిక్ పంపితే.. అతను దాన్ని రీట్వీట్ చేశాడు.
Tags:    

Similar News