రూ.45కోట్లు ఖర్చుతో బర్త్ డే కేక్

Update: 2015-09-16 10:30 GMT
వందల కోట్ల పెట్టి ఇళ్లు.. బంగ్లాలు కొనటం చూశాం. కోట్లాది రూపాయిలు వెచ్చింది ఖరీదైన ఆభరణాలు తయారు చేసుకోవటం విన్నాం. కానీ.. కేవలం తినేందుకు తయారు చేసే కేకు కోసం ఓ డబ్బులన్న పెద్దాయన ఏకంగా రూ.45కోట్లు ఖర్చు పెట్టటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని తన కుమార్తె బర్త్ డే కమ్ ఎంగేజ్ మెంట్ కోసం ఇంత భారీ ఖర్చుతో తయారు చేసినట్లు చెబుతున్నారు.

అయితే.. ఇంత భారీ ఖర్చుతో తయారు చేసిన కేక్ కొన్ని పెద్దమనిషి ఎవరన్న విషయాన్ని మాత్రం గుట్టుగా ఉంచేశారు. ఈ అత్యంత విలువైన కేక్ ను తయారు చేసింది బ్రిటన్ లో అయితే.. ఆర్డర్ ఇచ్చింది మాత్రం అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఒక వ్యాపారిగా చెబుతున్నారు. ప్రముఖ బ్రిటీష్ డిజైనర్ డెబ్బీ వింగమ్ దీన్ని తయారు చేశారట.

ఈ డిజైనర్ గతంలో రూ.11కోట్లు పెట్టి ఒక డ్రెస్ డిజైన్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. ఇక.. ఇన్నేసి కోట్లు పోసిన కేక్  విశేషాలు చూస్తే..

= కేక్ బరువు వెయ్యి పౌండ్లు (ఒక పౌండ్ 453.5గ్రాములు)

= ఈ కేక్ ఎత్తు ఆరు అడుగులు ఉంటుందట

= దీని తయారీకి పట్టిన సమయం 1100 గంటలు

= ఈ కేక్ లో రకరకాల ఫ్లేవర్లను జత చేశారు

= ఈ కేక్ లో వజ్రాల్ని ఉంచారు.  దాదాపు నాలుగు వేల వజ్రాల వరకూ ఈ కేక్ లో ఉంచారు.

= ఈ కేక్ లో ఉంచిన 4వేల వజ్రాల్లో 17 వజ్రాల విలువే దాదాపు రూ.30కోట్ల మేర ఉంటుందట.
Tags:    

Similar News