మద్యం తాగి వాహనం నడపడమే నేరం. డ్రంకెన్ డ్రైవ్ పేరిట ఎన్ని తనిఖీలు చేసినా మందుబాబులు మారడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మందు భామలు కూడా తాగి ఊగుతుండడం గమనార్హం.
ఓవైపు క్రిస్మస్ సెలవులు.. మరోవైపు న్యూఇయర్ పండుగ.. ఈ వీకెండ్ అంతా సెలవులు ఇచ్చేశారు. దీంతో అందరూ మందు విందులతో కాలం గడుపుతున్నారు. ఈక్రమంలోనే రోడ్లమీదకు రావడం తప్పనిసరి కావడంతో పోలీసులకు దొరికిపోతున్నారు. ఇదే ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారుతోంది. చాలా మంది డ్రంకెన్ డ్రైవ్ లో దొరికపోతున్నారు. పండుగకు ఎంజాయ్ చేద్దామనుకుంటే ఈ కొత్త కేసులు శరాఘాతంగా మారుతున్నాయి. తాగి వాహనం నడపడం తప్పే అయినా మరో ఆప్షన్ లేక అందరూ ఇలా దొరికిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో డ్రంకన్ డ్రైవ్ కేసులు రికార్డుస్థాయిలో పెరిగాయి. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు 45% పెరిగాయి. 2021లో హైదరాబాద్‌లో మొత్తం 29,398 కేసులు నమోదయ్యాయి. ఇది సంవత్సరం మొత్తానికి. ఇప్పుడు, 2022లో హైదరాబాద్‌లో మొత్తం సంవత్సరానికి మొత్తం 42.634 కేసులు నమోదయ్యాయి. సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఇప్పుడే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది.
నగరంలో ప్రమాదకరంగా అధిక సంఖ్యలో మరియు డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరిగాయి. 2021 మరియు 2022లో మొత్తం కేసులలో భయంకరమైన పెరుగుదల స్పష్టంగా అదే సూచిస్తుంది. హైదరాబాద్ పోలీసులు ఇటీవలి కాలంలో డ్రంకెన్ డ్రైవింగ్ నియంత్రణ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తనిఖీ కేంద్రాలు పెంచారు. అలాగే, కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
ఇక హైదరాబాద్ లో గత సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మందుబాబులు మాత్రం మారలేదు.
కేసులు వేలల్లోనే బుక్ అయ్యాయి..నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మద్యం బాబులను తనిఖీ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3,146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.ఆ ఒక్కరోజే వేల కేసులు నమోదయ్యాయి. ఈసారి మరి ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.