ఈ ఒక్క ఘటన చాలు.. మీ పిల్లలకు ఫోన్లు ఇవ్వాలో వద్దో తేల్చుకోడానికి!
చేతిలో ఉన్న స్మార్టు ఫోన్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇంటి నుంచే అన్ని పనులు చక్కపెట్టుకునేందుకు ఫోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే, అవే ఫోన్లు.. యువతను పెడతోవలు పట్టిస్తున్నాయి. చెడుదారుల్లో నడిపిస్తున్నాయి.
కేవలం యువతనే కాదు.. తాజాగా ఘటనలో ఓ నాలుగేళ్ల చిన్నారి ఈ ఫోన్లతోనే పెద తోవ పట్టింది. నిండా పదేళ్లు కూడా లేని ఈ పాప.. ఏకంగా తన తల్లినే బెదిరిస్తూ.. హెచ్చరిక లేఖలు రాసింది. 50 వేల రూపాయలు ఇవ్వకపోతే.. తన అక్కనే చంపేస్తానంటూ.. బెదిరించింది. దీంతో హడలిపోయిన.. ఆ తల్లి లేఖలు రాస్తోంది ఎవరో తెలియక పోలీసులను ఆశ్రయించింది. యూపీలో జరిగినఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
చిన్నపిల్లలు తల్లిని బొమ్మలో, ఆట వస్తువులో అడుగుతారు. కానీ, ఇక్కడ నాలుగో తరగతి చదివే ఓ పాప మాత్రం తల్లికి లెటర్ రాసి 50 వేల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే నీ పెద్ద కూతురి(అక్క)ని చంపేస్తానని బెదిరించింది. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మేఘా పాండే అనే మహిళ యూపీ కాన్పుర్లోని మస్వాన్పుర్ లో భర్త, ఇద్దరు పిల్లలతో కలసి నివసిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఆమెకు కొన్ని బెదిరింపు లేఖలు వస్తున్నాయి.
50వేల రూపాయలు ఇవ్వాలని, లేదంటే తన పెద్ద కూతురిని చంపేస్తామని ఆ లేఖల్లో ఉంది. దీంతో భయపడిపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళ ఇంటికి దర్యాప్తు కోసం వెళ్లారు. వివిధ కోణాల్లో పరిశోధన చేసిన అనంతరం అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ బెదిరింపు లేఖలు రాస్తున్నది పాండే కూతురేనని నిర్ధారించారు. పాప చేతి రాత, నోట్ పుస్తకాల ఆధారంగా ఈ విషయం తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై పోలీసులు పాపను పశ్నించగా, తానే లెటర్లు రాసి గేట్పై ఉంచేదాన్ని అని చెప్పింది. ఎవరైనా రాయమని చెప్పారా? అని అడగగా తానే సొంతంగా రాసినట్లు తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. చివరగా పాపకు ఇలాంటి పనులు ఇకముందు చెయ్యవద్దని చెప్పినట్లు వారు తెలిపారు. కొసమెరుపు ఏంటంటే.. తాను ఇవన్నీ .. ఫోన్లో చూసి తెలుసుకున్నట్టు చెప్పడమే. మరి ఈ ఘటనను బట్టి మీరు మీ పిల్లలకు ఫోన్లనుఇస్తారో.. లేదో తేల్చుకోవాల్సిందే!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.