భారత్ లో 5 కోట్ల మందికి వైరస్..అది తప్పనిసరి!

Update: 2020-05-22 13:30 GMT
ఇండియాలో మహమ్మారి పాజిటివ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు రోజుకు 5 వేల కేసులు నమోదవుతూ ఉండగా, గత 24 గంటల్లో ఏకంగా ఆరు వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం.. మొత్తం 1,18,447 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6088 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 66,331 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 48,533 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ తరుణంలోనే అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ ఎంఈ) పరిశోధకులు కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇండియాలో 5 కోట్లకి పైగా ప్రజలకు సమర్థవంతమైన హ్యాండ్‌ వాషింగ్ అందుబాటులో లేదని అమెరికా పరిశోధనలో వెల్లడైంది. ఆ 5 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు ఈ అధ్యయనంలో వెల్లడించారు. వైరస్ నియంత్రణకు చేతులు శుభ్రంగా ఉంచుకోవడమే చాలా కీలకమని, భారత్ లో 5కోట్ల మందికిపైగా ఈ కనీస సదుపాయం అందుబాటులో లేదని పరిశోధన స్పష్టం చేసింది.  నీరు, సబ్బు, శానిటైజర్లకు నోచుకోలేని పేద ప్రజలకే ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని, చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు, సబ్బు వంటి కనీస సదుపాయాలు లేని వారు పేద, మధ్య తరగతి దేశాల్లో దాదాపు 200 కోట్ల మందికిపైగా ఉన్నారని పరిశోధన చెబుతుంది.

ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో 25 శాతమని చెబుతున్నాయి పరిశోధనలు. సంపన్న దేశాలతో పోల్చితే వీరికే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. భారతదేశం, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నైజీరియా, ఇథియోపియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఇండోనేషియా లో ప్రతి దేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా శానిటైజర్లు, వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసినా, అవి శాశ్వత పరిష్కారం కాదని, ఏటా 7 లక్షల ప్రాణాలు హ్యాండ్వాష్ సమస్యను పరిష్కరించకపోతే వైరస్ కారణంగా చనిపోయే ప్రమాదం ఉందని పరిశోధనలో పాల్గొన్న బ్రూయెర్ హెచ్చరించారు
Tags:    

Similar News