ముష్క‌రుల దాడి.. ఐదుగురు సైనికులు మృతి

Update: 2018-01-01 06:29 GMT
కొత్త సంవ‌త్స‌రం వేళ దారుణ ప‌న్నాగాన్ని ప‌న్నారు ఉగ్ర‌వాదులు. కొత్త ఏడాదిని విషాదంతో షురూ చేయాల‌న్న‌ట్లుగా ఉగ్ర‌దాడిని చేశారు. కొత్త సంవ‌త్స‌రం వేళ విషాదంలో మునిగిపోయేలా ఐదుగ‌రు సైనికుల ప్రాణాల్ని తీశారు. నాలుగైదు రోజుల క్రితం జైషే మొహ‌మ్మ‌ద్‌కు చెందిన కీల‌క నేత నూరు మొహ‌మ్మ‌ద్ అలియాస్ చోటా నూర్ ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హ‌త‌మార్చాయి.

దీంతో జైషే మొహమ్మ‌ద్‌కు భారీ దెబ్బ త‌గిలింది. దీనికి ప్ర‌తీకారం తీర్చుకునే ప‌నిలో భాగంగా జ‌మ్ముక‌శ్మీర్ లోని పుల్వామాలోని సిఆర్ఫీఎఫ్ శిక్ష‌ణా కేంద్రం మీద ఉగ్ర‌వాదులు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. గ్రేనేడ్స్ ను విసురుతూ.. కాల్పులు జ‌రుపుతూ పుల్వామాలోని సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ పోర్స్ 185వ బెలాటియ‌న్ కేంద్రంలోకి దూసుకొచ్చారు. వారిని నిలువ‌రించేందుకు సిఆర్పీఎఫ్ ద‌ళాలు వెనువెంట‌నే స్పందించాయి.

ఇరు వ‌ర్గాల మ‌ధ్య భీక‌ర దాడులు.. ప్ర‌తిదాడులు చోటు చేసుఉన్నాయి. ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఐదుగురు జ‌వాన్లు మ‌ర‌ణించారు. సైనికులు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదుల్లో పుల్వామాకు చెందిన మంజూర్ అహ్మ‌ద్ బాబా.. ట్రాల్‌ కు చెందిన ప‌ర్దీన్ అహ్మ‌ద్ ఖాండేలుగా అధికారులు గుర్తించారు.

ఉగ్ర‌దాడిలో వీర మ‌ర‌ణం చెందిన ఐదుగురిలో సిఆర్పీఎఫ్ అధికారి ష‌రీఫ్ ఉద్ దిన్ గ‌నాయ్‌తో.. భ‌వ‌నంలో చిక్కుకొన్న అధికారి కుల్దీప్ రాయ్ గుండెపోటుగా మ‌ర‌ణించారు. మ‌రో ముగ్గురు ఉగ్ర‌వాదుల ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించారు. కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. ఉగ్ర‌దాడిలో ఐదుగురు మ‌ర‌ణించ‌టంపై స‌ర్వ‌త్రా విషాదం వ్య‌క్త‌మ‌వుతోంది. వీర జ‌వాన్ల ప్రాణాల్ని తీసిన ఉగ్ర‌వాదుల పీచ‌మ‌ణ‌చ‌ట‌మే కాదు.. అంకంత‌కూ మూల్యం చెల్లించేలా చేయాల్సిన అవ‌స‌స‌రం  ఎంతైనా ఉంది.
Tags:    

Similar News