సౌదీలో 50 మందికి మరణశిక్ష అమలు

Update: 2015-11-29 09:55 GMT
అరబ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. చాలా నేరాలకు మరో ఆలోచన లేకుండా మరణశిక్షను అమలు చేస్తుంటారు. నేరాల విషయంలో మహా కరుకుగా వ్యవహరిస్తూ.. మరణశిక్షల అమలును భారీగా అమలు చేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 150 మందికి మరణశిక్షను అమలు చేశారు.

తాజాగా ఈ శుక్రవారం ప్రార్థనలు అయిపోయిన తర్వాత 50 మంది నేరస్థులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. తాజాగా మరణశిక్ష అమలు చేయనున్న 50 మంది ఉగ్రవాద సంబంధ కేసుల్లోని నేరస్తులు కావటం విశేషం. తాజాగా అమలు చేయనున్న 50 మరణశిక్షలు అమలు అయితే.. ఈ ఏడాది మరణశిక్షల ద్వారా ప్రాణాలు పోయిన వారి సంఖ్య 200లకు చేరనుంది. ఉగ్రవాద సంబంధం ఉన్న నేరాలకు 50 మందికి మరణశిక్ష అమలు చేస్తుంటే.. ఎవరూ కనీసం నోరు విప్పటం లేదన్నది గమనించారా?
Tags:    

Similar News