దేశాన్ని విడిచిపెట్టి వెళుతున్న మిలియ‌నీర్లు!

Update: 2019-05-13 08:14 GMT
ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే మేకిన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన మోడీ.. విదేశాల నుంచి స్వ‌దేశానికి తిరిగి రావాల్సిందిగా కోరిన విష‌యం తెలిసిందే. మోడీ ప్ర‌క‌టించిన మేకిన్ ఇండియా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌టానికి కొన్ని విదేశీ కంపెనీలు దేశానికి వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో కొంద‌రు ఎన్ ఆర్ఐలు దేశంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపించినా.. ఆ కార్య‌క్ర‌మానికి పెద్ద ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు.

ఇదిలా ఉంటే..తాజాగా ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొత్త‌గా విడుద‌లైన నివేదిక ప్ర‌కారం ఇండియాకు చెందిన మిలియ‌నీర్లు పెద్ద ఎత్తున విదేశాల‌కు త‌ర‌లివెళుతున్న వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌డిచిన కొద్దినెల‌లుగా ఈ సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లుగా స‌ద‌రు నివేదిక పేర్కొంది.

అఫ్రో ఆసియా బ్యాంక్ తో పాటు న్యూ వ‌రల్డ్ వెల్త్ సంస్థ నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో షాకింగ్ అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గ్లోబ‌ల్ వెల్త్ మైగ్రేష‌న్ రివ్యూ 2019 పేరుతో విడుద‌లైన ఈ నివేదిక‌లోని అంశాలు చూస్తే.. గ‌డిచిన ఏడాది వ్య‌వ‌ధిలో ఐదు వేల‌కు పైగా మిలియ‌నీర్లు దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిన‌ట్లుగా లెక్క తేలిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంత భారీగా దేశాన్ని విడిచి వెళుతున్న వ్య‌క్తిగ‌త ఉన్న ఆదాయ‌వ‌ర్గాల వారు బ్రిట‌న్ కు ఎక్కువ‌గా వెళుతుండ‌టం గ‌మ‌నార్హం.

బ్రిగ్జెట్ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. అక్క‌డి అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌టానికి.. అక్క‌డ వ్యాపార అవ‌కాశాల‌తో పాటు.. రాజ‌కీయ‌.. ఆర్థిక‌.. సామాజిక అంశాల నేప‌థ్యంలో బ్రిట‌న్ కు వెళ్లేందుకు వారు మ‌క్కువ చూపుతున్న‌ట్లుగా వెల్ల‌డైంది. ఓప‌క్క దేశీయంగా వ్యాపార అవ‌కాశాలు భారీగా పెంచుతున్న‌ట్లుగా చెప్పే మోడీ మాష్టారి మాట‌ల‌కు భిన్న‌మైన రీతిలో తాజా రిపోర్ట్ ఉండ‌టం దేనికి సంకేతం?
Tags:    

Similar News