షాకింగ్ ... కోలుకున్న పేషేంట్స్ కి మరోసారి కరోనా !

Update: 2020-04-10 05:45 GMT
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి ప్రపంచదేశాలను వణిస్తోంది. ప్రపంచం మొత్తం మీద కరోనా కేసులు, మరణాలు రోజురోజుకి పెరిగిపోతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ప‌దిహేను ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా సుమారు 89వేల‌మంది మ‌ర‌ణించారు. మూడు ల‌క్ష‌ల‌ మంది పైచిలుకు దానితో పోరాడి విజ‌యం సాధించారు. అయితే పాజిటివ్ కేసులతో పోల్చి చూస్తే కోలుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఈ క్ర‌మంలో ఓ పిడుగు లాంటి వార్త అంద‌రినీ క‌ల‌వ‌ర‌ పెడుతోంది.

కరోనావైరస్ సోకి కోలుకున్న క‌రోనా పేషెంట్లకు మ‌ళ్లీ క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు లేక‌ పోలేద‌ని ద‌క్షిణ కొరియాలోని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) అభిప్రాయ‌ప‌డింది. ద‌.కొరియాలో క‌రోనా నుంచి బ‌య‌ట‌ ప‌డి క్వారంటైన్‌ లో ఉంటున్న‌ 51 మంది పేషెంట్ల‌కు మ‌రోమారు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి చూడ‌గా పాజిటివ్ అని తేలింద‌ని సీడీసీ డైరెక్ట‌ర్‌ జ‌న‌ర‌ల్ జియాంగ్ య‌న్‌ కియాంగ్ వెల్ల‌డించారు.  కొన్ని కేసుల్లో ఓ రోజు పాజిటివ్ గా వస్తే, మరో రోజు నెగెటివ్ గా వస్తుందని, దీనిపై ఫోకస్ పెట్టామని చెప్పారు.

దీనితో అలా మళ్లీ కరోనా సోకినవారిని ఐసోలేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.  ఇలా వైర‌స్ మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌డంపై పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని య‌న్‌ కియాంగ్ తెలిపారు. కాగా క‌రోనా సోకిన రోగికి రెండు సార్లు నెగిటివ్ రిపోర్టు వ‌స్తేనే అత‌ను పూర్తిగా కోలుకున్న‌ట్లు భావిస్తారు. ఇదిలా ఉండ‌గా బుధ‌వారం నాటికి ద‌.కొరియాలో 10,384 కేసులు న‌మోదు కాగా 6,776 మంది కోలుకున్నారు.
Tags:    

Similar News