తాలిబన్ల చెరలో చిక్కిన 55 మంది భారతీయులకు విముక్తి

Update: 2022-09-26 05:53 GMT
తాలిబన్లు.. ఈ భూమిపై ఐసిస్ తర్వాత అత్యంత డేంజర్ ఉగ్రవాద మూకగా పేరుగాంచారు. బతికి ఉన్నప్పుడే నరకం చూపించగల వీరిని చేష్టలు తలుచుకుంటే గగుర్పొడేలా ఉంటాయి. అమెరికా సైన్యం వైదొలగడంతో రెప్పపాటులోనే అప్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇప్పుడు ఆ దేశాన్ని నిరంకుశంగా పాలిస్తున్నారు. అక్కడ బందీలుగా చిక్కిన భారతీయులు సహా ఇతర దేశస్థులకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు.

భారత్ లోనే కాదు.. పక్కనున్న పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ లోనూ భారతీయులు ఉన్నారు. తరతరాలుగా తాము నివాసం ఉంటున్న అప్ఘనిస్తాన్ నేలను విడిచి తాజాగా ఆదివారం 55మంది సిక్కులు, హిందువులు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు.  ఇంకా 35మంది వరకూ అప్ఘనిస్తాన్ లోనే చిక్కుకున్నారని సమాచారం.

గత ఏడాది ఆగస్టులో అప్ఘాన్ లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత చాలా మంది సిక్కులు, హిందువులు భారత్ కు తరలివచ్చారు. జూన్ లో కాబూల్ లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై ఉగ్రదాడి అనంతరం ఈ సంఖ్య మరింత పెరిగింది.

ఆదివారం భారత్ కు చేరుకున్న 55 మంది ప్రయాణ ఏర్పాట్లను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ పర్యవేక్షించింది. వీరి కోసం కాబూల్ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం ఈ-వీసాలు మంజూరు చేయడంతో వేగంగా స్పందించింది.

అయితే వీరితోపాటు సిక్కుల పవిత్ర గ్రంథాలను భారత్ కు తీసుకొచ్చేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి నిరాకరించారు. 'తాలిబన్లు మోసం చేశారు. 4 నెలలు జైల్లో నరకయాతన అనుభవించాం' అని ఓ వ్యక్తి వాపోయాడు. భారత్ కు చేరినందుకు సంతోషంగా ఉందన్న శరణార్థులు.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన 35 మందిని భారత్ కు తీసుకురావాలని వారు కోరారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News