వైద్యులకే షాక్.. వృద్దుడి కడుపులో 59 అడుగులు పురుగు!

Update: 2021-03-26 09:30 GMT
ఓ వృద్దుడి కడుపులో 59 అడుగుల టేప్ వర్మ్ పురుగును వైద్యులు వెలికితీశారు. తొలుత ముక్కలు ముక్కలుగా లాగిన ఈ పురుగును అంతా ఒక దగ్గర చేర్చితే 59 అడుగులుగా ఉంది. థాయ్ లాండ్ లో చోటు చేసుకున్న ఈ అరుదైన సంఘటన చూసి వైద్యులే షాక్ కు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతూ నాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు 67 ఏళ్ల వృద్దుడు. తాను ఆపానవాయువు అనే సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్లకు చెప్పారు. పరీక్షల అనంతరం అతడు టేప్ వర్మ్ (ఆంత్రపరాన్న పురుగు) సమస్యతో బాధపడుతున్నాడని.. అతని కడుపులో ఆ పురుగు 28 గుడ్లను వైద్యులు గుర్తించారు.

తర్వాత నులిపురుగును నిర్మూలించే మాత్రలను ఇవ్వగా అది టేప్ వర్మ్ పై ప్రభావం చూపింది. అతడి మలద్వారం గుండా ఆ పురుగు బయటకు వచ్చింది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టిందని.. చిన్న చిన్న ముక్కలుగా చివరకు మొత్తంగా 18 మీటర్లు బయటకు తీశారు. ఈ విషయాన్ని ఆ ఆస్పత్రిలోని పారాసైటిక్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది వెల్లడించారు. ముక్కలుముక్కులుగా బయటకు తీసిన ఆ పురుగు ఏకంగా 59 అడుగులున్నట్లు తేలిందని తెలిపారు.
Tags:    

Similar News