జమ్మూకాశ్మీర్ లో వైష్ణోమాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ఒక హెలికాఫ్టర్ కూలి.. పైలెట్ సహా ఏడుగురు మరణానికి కారణం పక్షిగా తేల్చారు. జమ్మూలోని కట్రా దగ్గర నుంచి వైష్ణోమాత దర్శనం కోసం హెలికాఫ్టర్ సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు. సోమవారం.. ఇదే విధంగా సర్వీసు నిర్వహిస్తున్న సమయంలో పక్షి కారణంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూకి 50 కిలోమీటర్ల రూంలో కట్రా నుంచి వైష్ణోదేవి ఆలయానికి హెలికాఫ్టర్ సర్వీసులు నడుపుతుంటారు.
త్రికూట పర్వతాల్లో 5,300 అడుగులఎత్తులో వైష్ణోదేవి ఆలయం కొలువు తీరి ఉంది. అమ్మవారి దర్శనానికి నడకగా వెళ్లి దర్శించుకుంటారు. అయితే.. ఇది కష్టసాధ్యంగా ఉండటం.. సులువైన ప్రయాణం కోసం హెలికాఫ్టర్ సర్వీసులు ఏర్పాటు చేశారు. సోమవారం ఇదే రీతిలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో ఒక పక్షి.. హెలికాఫ్టర్ చివరి భాగంలో ఉండే ఫ్యాన్ లో చిక్కుకుపోవటంతో ఫ్యాన్ ఆగిపోవటం.. మంటలు రేగాయి.
ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ ను కిందకు దించాలని పైలెట్ ప్రయత్నించారు. ఈ క్రమంలో హెలికాఫ్టర్ కుప్పకూలి.. పైలెట్ సహా ఏడుగురు మరణించారు. ఈ హెలికాఫ్టర్ కు పైలెట్ గా వ్యవహరిస్తున్న సుమితా విజయన్ స్వస్థలం కేరళ అయినప్పటికీ.. పిల్లలు.. తల్లితో కలిపి ఆమె హైదరాబాద్ లో నివసించేవారు. గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసిన ఆమె.. హిమాలయన్ హెలీ సర్వీసెస్ లో చేరారు. అనంతరం ఆమె జమ్మూకు షిఫ్ట్ అయ్యారు. ఇక.. పైలెట్ తో పాటు మరణించిన వారి విషయానికి వస్తే.. జమ్మూకు చెందిన అర్జున్ సింగ్.. వందనలు కొత్తగా పెళ్లి అయిన నవ దంపతులు. వారి వివాహం ఈ నెల 18న జరిగింది. వివాహం నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చి.. ఈ రకంగా మృత్యుపాలు కావటం అందరిని కలిచివేస్తోంది.