ఆరు ప్రైవేటు బ్యాంకుల మొండిబాకీలు ల‌క్ష కోట్లు!

Update: 2018-05-12 05:24 GMT
గుండెలు అదిరిపోయే మాట ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌ది వేల రూపాయిల రుణం కావాల‌ని బ్యాంకుకు సామాన్యుడు వెళితే.. అడిగే ప్ర‌శ్న‌లు అన్నిఇన్నికావు. ఇదంతా ఎందుకు.. ఏళ్ల‌కు ఏళ్లు ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి.. ఏదైనా చిన్న సాయం అడిగితే రూల్స్ ఒప్పుకోవంటూ క‌రాఖండిగా చెప్ప‌టంలో బ్యాంకుల త‌ర్వాతే ఎవ‌రైనా.  మ‌రి..అంత జాగ్ర‌త్త‌గా ఉండే బ్యాంకుల‌కు మొండి బాకీలు వెంటాడ‌టం ఏమిట‌న్న‌ది చూస్తే.. సామాన్యుల‌కు రూల్స్ చెప్పే బ్యాంకులు పెద్దోళ్ల విష‌యంలో ఎంత విన‌య విధేయుత‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తారో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

బ్యాంకుల మొండి బ‌కాయిల విష‌యంలో ప్రైవేటుతో పోలిస్తే.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ‌గా ఉంటుంద‌న్న భావ‌న ఎక్కువ‌. అయితే.. అది ఉత్తి అపోహేన‌ని.. ప్ర‌భుత్వ బ్యాంకుల‌తో  ప్రైవేటు బ్యాంకులు పోటీ ప‌డుతున్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌భుత్వ బ్యాంకుల్ని వెంటాడుతున్నంత‌గా మొండి బ‌కాయిల తీవ్ర‌త ప్రైవేటు బ్యాంకుల‌కు లేన‌ప్ప‌టికీ.. ఆరు ప్రైవేటు బ్యాంకుల‌కున్న మొండి బ‌కాయిల లెక్క విన్నంత‌నే గుండెలు అదిరిపోవ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  

షాకింగ్ విష‌యం ఏమిటంటే.. 2015 సెప్టెంబ‌రులో బ్యాంకుల ఆస్తుల నాణ్య‌త స‌మీక్ష చేప‌ట్టే నాటికి ఆరు ప్రైవేటు బ్యాంకుల మొండి బ‌కాయిలు రూ.28,033 కోట్లు ఉంటే.. 2018 మార్చి నాటికి ఆ మొత్తం రూ.ల‌క్ష కోట్ల‌కు చేరుకోవ‌టం ఆందోళ‌న క‌లిగించ‌క మాన‌దు. ఏం పోయే కాలం వ‌చ్చింద‌ని ప్రైవేటు బ్యాంకుల మొండి బ‌కాయిలు ఇంత భారీగా పెరిగిపోయాయ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

మొండి బ‌కాయిలు భారీగా ఉన్న ఆరు ప్రైవేటు బ్యాంకులు చూస్తే..

+ హెచ్ డీఎఫ్ సీ
+ ఐసీఐసీఐ
+ యాక్సిస్
+ కోట‌క్ మ‌హింద్రా
+ య‌స్ బ్యాంక్
+ ఇండ‌స్ ఇండ్ బ్యాంకు
Tags:    

Similar News