తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలు కావటం తెలిసిందే. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ జిల్లాలకు పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిలో హైదరాబాద్ స్థానానికి జరిగిన ఎన్నిక ఓట్ల లెక్కింపు వ్యవహారం ఎన్నికల అధికారులకు.. రాజకీయ పార్టీలకు చుక్కలు కనిపించేలా చేస్తున్నాయి.
నిన్న (బుధవారం) మొదలైన ఓట్ల లెక్కింపులో నల్గొండ మొదటి రౌండ్ ఫలితం నిన్న రాత్రికి వస్తే.. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ ఫలితం గురువారం ఉదయం 5 గంటలకు కానీ వెలువడలేదు. ఎందుకింత ఆలస్యం అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. నల్గొండతో (మూడు జిల్లాలను ప్రతిసారీ ప్రస్తావించే బదులుగా నల్గొండ అని ) పోలిస్తే.. హైదరాబాద్ కు (మూడు జిల్లాల పేర్లను ప్రస్తావించకుండా హైదరాబాద్ అని ప్రస్తావిస్తున్నాం) జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే దీనికి కారణంగా చెప్పాలి. రికార్డు స్థాయిలో 93 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడటం.. దీనికి తోడు.. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఉన్న సంక్లిష్టత ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో.. ఒక ఓటును లెక్కించటానికి ఏకంగా 60 నుంచి 70 సెకన్లు పడుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఇంత సమయం పట్టటానికి కారణం.. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటమే. లెక్క వేసే ఓటును విప్పదీసి (న్యూస్ పేపర్ సైజులో ఉంది).. అందరి అభ్యర్థులకు కనిపించేలా చూపించి.. అందులో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి పడిందని చూపించిన తర్వాత.. వారికి కేటాయించిన బాక్సులో పెట్టాల్సి ఉంటుంది. ఇదంతా జరిగటానికి ఏకంగా నిమిషానికి పైనే సమయం పడుతోంది.
హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపునకు సంబంధించి విపరీతమైన ఆలస్యం అవుతోంది. ఓట్లను లెక్కించేందుకు వీలుగా కట్టలు కట్టే కార్యక్రమం పూర్తి కావటానికి బుధవారం రాత్రి 10 గంటల వరకు సాగింది. నల్గొండకు మాత్రం నిన్న రాత్రి ఏడు గంటలకే ముగిసి.. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. రాత్రి పది గంటలకు మొదలైన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు.. గురువారం ఉదయం 5 గంటలకు పూర్తి అయ్యింది. అంటే.. ఒక రౌండ్ ఓట్ల లెక్కింపునకు పట్టిన సమయం ఏకంగా ఏడు గంటలు. సుమారు ఆరు రౌండ్లను లెక్కించాల్సి వస్తే.. 42 గంటలు అంటే.. రేపు (శుక్రవారం) రాత్రి వరకు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సుదీర్ఘంగా సాగే ఈ ఓట్ల లెక్కింపుతో అందరికి చుక్కలు కనిపిస్తున్నాయి.