మ్యాగీః 5 నిమిషాల్లో 60వేల కిట్లు

Update: 2015-11-12 22:30 GMT
ఇండియా నూడుల్స్ మార్కెట్ దిగ్గ‌జంగా ఉండి వివాదంలో చిక్కుకున్న మ్యాగీకి రీ ఏంట్రీ సూప‌ర్ డూప‌ర్‌ గా క‌లిసివ‌చ్చింది. అనుమతించిన పరిణామం కంటే సీసం ఎక్కువ పాళ్లు ఉందని తేలడంతో ఐదు నెలల కిందట మ్యాగీని భారత్ లో నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటివ‌ర‌కు మార్కెట్ లో ఉన్న స్టాకునంతా ఉపసంహరించుకున్న మ్యాగీ తాజా సరుకుతో అన్ని పరీక్షలనూ దాటుకుని ఐదు నెలల తరువాత మళ్లీ భారత్ లో ప్రవేశించింది.

అన్ని ప‌రీక్ష‌ల‌ను దాటుకొని మార్కెట్‌ లోకి వ‌చ్చిన మ్యాగీకి తీపిక‌బురు ద‌క్కింది. ఈ రోజు నుంచి భారత్ లో ఆన్ లైన్ లో మ్యాగీ విక్రయాలు మొదలవ‌గా....ఆన్ లైన్ లో మ్యాగీ అందుబాటులోనికి వచ్చిన ఐదు నిముషాల వ్యవధిలోనే దాదాపు 60వేల వెల్ కమ్ మ్యాగీ కిట్లు అమ్ముడయ్యాయి. ఐదు నిముషాల వ్యవధిలో 60 వేల మ్యాగీ కిట్ లు అమ్ముడు కావడం మ్యాగీకి భారత్ లో ఉన్న డిమాండ్ కు నిదర్శనంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప‌రిణామం నెస్లే ఇండియాకు పెద్ద ఉప‌శ‌మ‌న‌మ‌ని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News