దాయాది దారుణం..మనోళ్లు 7గురు ప్రాణత్యాగం
దాయాది మరో దొంగ దెబ్బ తీసింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న పాక్ కు.. ఆ దేశ కొత్త ఆర్మీ ఛీప్ గా జనరల్ జావెద్ బజ్వా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే భారత్ ను దొంగ దెబ్బ తీశారు. తీవ్రవాదుల సాయంతో జమ్మూలోని ఆర్మీ ఆర్టిలరీలోకి ప్రవేశించిన వారు జరిపిన విచక్షణరహిత కాల్పుల్లో మన సైనికులు ఏడుగురు ప్రాణత్యాగం చేశారు.
జమ్మూలోని రెండు వేర్వేరుప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉగ్రదాడుల్లో మనోళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక మేజర్ తో సహా ఏడుగురు సైనికులు ఫ్రాణాలు కోల్పోవటం గమనార్హం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మంచి పట్టున్నట్లు చెప్పే బజ్వా.. తాను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే భారతసైనికుల మీద ఉగ్రదాడి జరిగేలా తీసుకున్న నిర్ణయం.. భారత్ కు ఆయన పంపిన హెచ్చరికగా సైనిక వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున కొంతమంది సాయుధ ఉగ్రవాదులు పోలీసుల దుస్తుల్లో నగ్రోటాలోని ఆర్మీ ఆర్టిలరీ విభాగంలోకి ప్రవేశించారు. గ్రెనేడ్లు విసురుతూ.. ఆర్మీ మెస్ కాంప్లెక్స్ లో చొరబడి అక్కడి సెంట్రీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక అధికారితో పాటు మరో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. అనంతరం.. సైనిక కుటుంబాలున్న ఇళ్లల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. జవాను సతీమణులు ధైర్యంగా వ్యవహరించటంతో మరింత ప్రాణనష్టం వాటిల్లలేదు.
అనంతరం స్పందించిన సైన్యం ఆపరేషన్ నిర్వహించి.. ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు.ఆ ఆపరేషన్ లో ఒక అధికారికతో పాటు.. మరో ఇద్దరుజవాన్లు ప్రాణత్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. మరో ఘటనలో రామ్ గఢ్ సెక్టార్ లో పాక్ ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నం చేశారు. వీరి ప్రయత్నాల్ని భగ్నం చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. మరణించిన ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాల్ని.. వైర్ లెస్ సెట్ నుస్వాధీనం చేసుకున్నారు. వరుస ఘటనలో సరిహద్దు ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/