కొన్ని సందర్భాల్లో కష్టాలన్నీ మరీ కట్టకట్టుకొచ్చినట్లుగా మీద పడిపోతుంటాయి. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా తెర మీదకు వస్తున్న ఉదంతాలతో ఆయన సర్కారు ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సెగ కేంద్రంలోని మోడీ సర్కారుకు కూడా తాకటం యోగికి మరింత ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ ఉదంతానికి తగ్గట్లే మరో ఉదంతం యూపీలో వెలుగు చూడటం ఇబ్బందికరంగా మారింది. యూపీకి చెందిన ఏడేళ్ల మైనర్ బాలికపై దుండగుడు అత్యాచారం చేసి హత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.
బంధువుల పెళ్లి వేడుకకు వచ్చిన ఏడేళ్ల చిన్నారిపై షామియానాలు వేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి.. అనంతరం తాడుతో గొంతు బిగించి హత్య చేయటం కలకలాన్ని రేపుతోంది. ఈ ఉదంతానికి కారణమైన నిందితుడ్ని లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఉదంతంపై రగిలిపోయిన బాధితురాలి కుటుంబ సభ్యలు రాస్తారోకోను చేపట్టారు.
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార దారుణానికి పాల్పడిన వ్యక్తిని 19 ఏళ్ల సోనూ జాటవ్ గా గుర్తించారు. పెళ్లి వేడుకకు దగ్గర్లోని ఒక నిర్మాణంలో ఉన్న ఇంట్లో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతంలో ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే పుణ్యమా అని యూపీలో అధికార బీజేపీకి పెద్ద తలనొప్పిని ఎదుర్కొంటోంది. ఇది సరిపోనట్లుగా తాజాగా వెలుగు చూసిన వైనం యోగి సర్కారును చిక్కుల్లోకి నెడుతోంది. వరుసగా వెలుగు చూస్తున్న అత్యాచార ఉదంతాలు యూపీ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తిని అంతకంతకూ పెంచేలా చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ఏడాది కంటే తక్కువకు వచ్చేసిన వేళ.. ఈ తరహా ఉదంతాలు ఏ మాత్రం మంచివి కావని చెప్పక తప్పదు.