సుదీర్ఘంగా సాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన తొలి అంకం ముగిసింది. రెండు రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ ఈ రోజు పూర్తి అయ్యింది. ఇప్పటివరకూ వినే 60 శాతం పోలింగ్ కు భిన్నంగా.. రెండు రాష్ట్రాల్లో జరిగిన తొలిదశ పోలింగ్ కు ఓటర్లు భారీగా పోటెత్తారు. దీంతో.. భారీగా ఓట్లు పోల్ కావటం గమనార్హం. ఐదు రాష్ట్రాలు (గోవా.. పంజాబ్.. మణిపూర్.. ఉత్తరాఖండ్.. యూపీ) ఎన్నికలు జరుగుతుండగా ఈ రోజు గోవా.. పంజాబ్ రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ పూర్తి అయ్యింది.
గోవా అసెంబ్లీకి జరిగిన తొలిదశ పోలింగ్ లో 83 శాతం ఓట్లు నమోదు కాగా.. పంజాబ్ లోనూ 70 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు కావటం గమనార్హం. గోవాలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురుకాకున్నా.. పంజాబ్ లో జరిగిన పోలింగ్ లో మాత్రం పలుచోట్ల ఈవీఎంలు మొరాయించటం.. వాతావరణం అనుకూలించకపోవటం లాంటివి చోటు చేసుకున్నాయి.
సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లు అందరికి గడువు పూర్తి అయిన తర్వాత కూడా ఓట్లు వేసేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం.. పోలింగ్ పూర్తి వివరాలు వచ్చేసరికి.. ఇప్పుడున్న శాతం కంటే మరింత పెరిగే వీలుందన్నమాట వినిపిస్తోంది. మరింతలా పోటెత్తుతున్న ఓటర్లు ఎలాంటి తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/