సెకండ్‌ వేవ్‌ లో 719 మంది వైద్యులు మృతి !

Update: 2021-06-12 10:31 GMT
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్‌ లో 719 మంది వైద్యులు చనిపోయినట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో బీహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా డాక్టర్లు చనిపోయారని ఐఎంఎ వెల్లడించింది. సెకండ్ వేవ్ సమయంలో బీహార్‌ లో 111, ఢిల్లీలో 109, ఉత్తర ప్రదేశ్‌ లో 79, పశ్చిమ బెంగాల్‌ లో 63, రాజస్థాన్‌ లో 43 మంది డాక్టర్లు చనిపోయారు. కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్‌ లో ఏపీలో 35, తెలంగాణలో 36 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు రెండు విడతల్లో 1467మంది డాక్టర్లు చనిపోగా, గతేడాది మొదటి దశలో కరోనాతో 748 మంది డాక్టర్లు చనిపోయారు. భారత్‌ లో 12 లక్షలకు పైగా డాక్టర్లు ఉండగా, వైద్యుల సంఘంలో రిజిస్టరైనవారు 3.5 లక్షల మంది మాత్రమే ఉండగా, చనిపోయిన వారి సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా హెల్త్ వర్కర్స్‌ లో సుమారు 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫస్ట్ డోసును 90శాతం మంది తీసుకున్నారు. అత్యధికంగా బిహార్‌ లో 111 మంది వైద్యులు చనిపోయారని, ఢిల్లీలో 109, యుపిలో 79 మంది, పశ్చిమ బెంగాల్‌ లో 63 మంది, రాజస్థాన్‌ లో 43 మంది, జార్ఖండ్‌ లో 39 మంది, గుజరాత్‌లో 37, తెలంగాణలో 36 మంది, ఏపీలో 35 మంది , తమిళనాడులో 32 మంది వైద్యులు కరోనా కాటుకు బలయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి వేవ్‌ లో 748 మంది వైద్యులు కరోనాతో చనిపోయారని వారు వెల్లడించారు. కరోనాతో అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


Tags:    

Similar News