కూకట్ పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ లో అదో పాడుబడ్డ ఇళ్లు.. ఎవరూ నివసించని ఆ ఇంట్లో 68 ఓట్లు - అలాగే మరో పాడుబడ్డ ఇంట్లో 74 ఓట్లు ఉన్నాయి. మనుషులు లేని ఇంట్లో అన్ని ఓట్లు ఎలా వచ్చాయని కలకలం రేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటర్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి..
కూకట్ పల్లి కేంద్రంగా లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు బయటపడుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూకట్ పల్లిలోని పాడుబడ్డ ఇళ్లలో 60 - 70 మందికి పైగా ఓటు హక్కు ఉన్నట్టు లిస్ట్ లో ఉంది. వారంతా మరోచోట ఓటు నమోదు చేసుకున్నారా.? లేదా అన్నది వెల్లడి కాలేదు. అయితే వీరందరికీ ఎక్కడో చోట ఓటు ఉండి ఉంటుందని.. వారి ఓట్లను అధికారులు తొలగించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాగా ఎంతో మంది తమ ఓటును తీసేశారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్డులున్నా ఓటు హక్కులేదని వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటు ఉందని.. ఇప్పుడు ఓట్లను తీసేశారని ఆరోపిస్తున్నారు. ఓటు నమోదు కోసం ఎంతో తిరిగినా అధికారులు నమోదు చేయలేదని మండిపడుతున్నారు. మనుషులు లేని ఇంట్లో ఓట్లు ఉన్నాయని.. తాము ఇక్కడ ఉంటున్నప్పటికీ ఓట్లు తొలగించారని కూకట్ పల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.