కరోనా వైరస్ మహమ్మారి కి కట్టడికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. ఎంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే అంత త్వరగా కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకురావచ్చు. అయితే , వ్యాక్సిన్ల కొరత కూడా కొంచెం సమస్యగా మారింది. మరోవైపు కొందరు ఇంకా వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని ప్రధాని మోడీ బాహుబలిగా పోల్చి చెప్పారు. ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా ముందుకి సాగుతుంది. ఈ తరుణంలో ఇండియన్స్ కి మరో గుడ్ న్యూస్. కరోనాను జయించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కావడంతో దేశంలోని అర్హులందరికీ సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో పాటు మరికొన్ని వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగానే తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. మోడెర్నా వ్యాక్సిన్‌ను సిప్లా కంపెనీ దిగుమతి చేయనుంది. ఇది కరోనాపై 90 శాతం సమర్థంగా పని చేస్తున్నట్టు తేలింది. ఇండియాలో కరోనా వైరస్ కోసం అత్యవసర అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ విలకు డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. తాజాగా మోడెర్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని వ్యాక్సిన్లకు కూడా అనుమతులు లభించే అవకాశం ఉంది
ప్రపంచంలో ఫైజర్ వ్యాక్సిన్ తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న కరోనా వ్యాక్సిన్ మోడెర్నా. అయితే ఈ వ్యాక్సిన్ ఇంకా భారతదేశంలోకి ఇంకా రాలేదు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. అతి కొద్ది రోజుల్లోనే 7.5 మిలియన్ డోసుల మోడెర్నా కొవిడ్ టీకాలు భారత్ కు అందనున్నాయి. నష్ట పరిహారం మాఫీతో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం మోడెర్నా, ఫైజర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.
ప్రభుత్వం సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని, కాంట్రాక్టుపై పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని, ఈ ప్రస్తుతం చర్చల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన కోవ్యాక్స్ ప్రోగ్రాం కింద.. భారత్ కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్ డోసుల అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు భారత్‌కు ఆఫర్ అందించామని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ డోసులు భారత్‌కు ఎప్పటికీ చేరుకుంటాయనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యాక్సిన్ లభ్యత ‘ఇండెమ్నిటీ క్లాజు’తో ముడిపడి ఉందని ఖేత్రపాల్ తెలిపారు. కాగా, గత నెల భారత్‌లో మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. అయితే ఈ అనుమతులు పూర్తి స్థాయిలో లభించలేదు.
భారత డ్రగ్ ఉత్పత్తి సంస్థ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటుందని, వీటిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఇప్పటికే మోడెర్నా కంపెనీతో చర్చలు జరుపుతున్నామని ఇటీవలే నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు సిప్లా కంపెనీకి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టీకాను అత్యవసర వినియోగానికి సైతం అనుమతి ఇచ్చింది. అయితే, నష్టపరిహార నిబంధన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత ప్రభుత్వం పలు షరతులను విధిస్తూ పరిశీలన కోసం వాటిని ఇటీవలే అమెరికాకు చెందిన టీకా తయారీ సంస్థలకు పంపినట్లు సమాచారం.