మహిళలు ప్రస్తుతం మగవారితో దీటుగా అన్ని రంగాలలో పోటీపడుతున్నారు విజేతలుగా నిలుస్తున్నారు. అలాగే మగవారికంటే ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఆడవాళ్లు , మగవారిని కొంతవరకు ఆదర్శంగా తీసుకోని .. ముందుకు నడుస్తే పర్వాలేదు కానీ , మగవారు చేసే అన్ని పనులను మేము చేసి చూపిస్తాం అంటే ఇలాగే అవుతుంది. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా ?
సాధారణంగా ఎక్కువగా పేకాట ఆడుతూ మగవారు పోలీసులకి దొరికిపోతుంటారు. కానీ , మగవారి కంటే మేము ఏం తక్కువా అని భావించిన తాడేపల్లి మహిళలు పేకాట దుకాణాన్ని తమ ఇళ్లలోనే ఓపెన్ చేసారు. పట్టణంలోని మహానాడు పట్టాభి రామయ్య కాలనీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావు మహిళా పోలీసులతో కలసి ఆదివారం రాత్రి దాడి చేశారు.
అక్రమంగా పేకాట ఆడుతున్నారన్న సమచారంతో దాడులు చేసిన తాడేపల్లి పోలీసులు షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్లంతా మహిళలు.పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా 36 వేల 250 రూపాయల నగదును, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో జూదం కూడా లక్షలో జరుగుతుండడంతో పోలీసులు కూడా అవాక్కయారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే .అరెస్ట్ చేసిన 8 మందిలో ఇద్దరు మహిళలు గతంలో కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు.