స్పీకర్‌ ను ఫ్యాక్షనిస్టు అనేశారు

Update: 2015-03-19 08:02 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అవాంఛనీయ పరిస్థితులు మరోసారి చోటు చేసుకున్నాయి. బుధవారం అధికార.. విపక్షాల మధ్య బూతుపురాణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

        అధికారపక్షానికి చెందిన మహిళా మంత్రిని ఉద్దేశించి విపక్ష నేత రోజా ఏ స్థాయిలో విరుచుకుపడింది.. ఎలా వ్యవమరించింది చీఫ్‌ విప్‌ విడుదల చేసిన సీడీని చూసిన ప్రతిఒక్కరికి అర్థమైంది.

        అధికారపక్షంపై ఉన్న అసంతృప్తిని ప్రకటించే క్రమంలో విపక్షం విరుచుకుపడటం మామూలే అయినా.. ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతల వ్యవహారం కాస్తంత విభిన్నంగా ఉంది. తమకు తోచినట్లు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా వారు వెనక్కి తగ్గటం లేదు. సభా వ్యవహారాల్ని అడ్డుకుంటున్నారన్న ఆరోపణపై ఎనిమిది మంది వైఎస్సార్‌కాంగ్రెస్‌ నేతలపై సస్పెన్షన్‌ విధించటానికి ఆమోద ముద్ర వేసిన స్పీకర్‌పై విపక్షం విరుచుకుపడింది.

        స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను ఫ్యాక్షనిస్టు అంటూ విపక్ష నేతలు వ్యాఖ్యానించటంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. స్పీకర్‌ స్థానాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చేసినవారిని ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ అధికారపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. నిన్నటివరకూ సభ్యుల మధ్యనే సాగిన రచ్చ.. తాజాగా స్పీకర్‌ ను తాకటం గమనారÛం. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విపక్ష నేతల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News