80 ఏళ్ల రైతుకు నోటీస్‌..ఎంపీ స‌ర్కారు పోయే కాలం!

Update: 2018-05-30 05:27 GMT
పోయే కాలం ద‌గ్గ‌ర ప‌డితే అంతే.. ఇలాంటివే చోటు చేసుకుంటాయి. తాజా ఉదంతాన్ని చూస్తే.. మ‌రికొద్ది నెల‌ల్లోజ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లిపోతాయ‌న‌టానికి వీలుగా నిలువెత్తు నిద‌ర్శ‌నం లాంటి ఒక ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.

ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా పేరొందిన బీజేపీ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల్లో అసంతృప్తిని అంత‌కంత‌కూ రెట్టింపు చేస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు మంట పుట్టేలా చేస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన 80 ఏళ్ల రైతుకు నోటీసులు జారీ చేయ‌టం ద్వారా త‌న తీరును చెప్ప‌క‌నే చెప్పేసింది.

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానాల‌కు నిర‌స‌న‌గా జూన్ 1 తేదీన నీముచ్ తాలుకా ఆఫీస్ ముందు భార‌తీయ కిసాన్ యూనియ‌న్ కార్య‌క‌ర్త‌ల ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా కార్య‌క్ర‌మం ఒక‌టి నిర్వ‌హించ‌నున్నారు. దీనికి భారీ ఎత్తున రైతులు హాజ‌రు కానున్నార‌ని.. ప్ర‌భుత్వ తీరుపై త‌మ‌కున్న అసంతృప్తిని ప్ర‌ద‌ర్శించ‌నున్నార‌ని చెబుతున్నారు. దీంతో.. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని క‌ట్ట‌డి చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

తాలూకా ప‌రిధిలోని రైతుల‌కు నోటీసులు ఇస్తూ.. త‌మ వ‌ద్ద‌కు హాజ‌రు కావాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 80 ఏళ్ల వృద్ధ రైతు గ‌ణేశ్ర‌మ్ పాటిదార్ కు నోటీసులు జారీ చేశారు. రైతుల ధ‌ర్నా కార్య‌క్ర‌మంపై నిఘా విభాగం అలెర్ట్ చేయ‌టంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా తాము నోటీసులు జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. నోటీసుల జారీ కార్య‌క్ర‌మాన్ని స‌రైన మ‌దింపు చేయ‌కుండా ఇష్టారాజ్యంగా చేప‌ట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే..అధికారులు నోటీసులు జారీ చేసిన పాటిదార్ గ‌డిచిన కొన్ని నెల‌లుగా అనారోగ్యంతో మంచాన ప‌డి ఉన్నారు. లేవ‌లేని స్థితిలో ఉన్న ఆయ‌న ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో పాల్గొనే ఛాన్స్ లేదు.

అయిన‌ప్ప‌టికీ నిఘా విభాగం త‌మ‌ను అలెర్ట్ చేసిన నేప‌థ్యంలో అన్న‌దాత‌ల‌కు నోటీసులు అంద‌జేసి.. రూ.25వేల పూచీక‌త్తును స‌మ‌ర్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

మంచాన ప‌డిన ఒక వృద్ధ రైతు విష‌యంలో అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణిని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.  ఇదొక్క‌టి చాలు.. ఎంపీలో ప్ర‌భుత్వ తీరు ఎలా ఉంద‌న్నది ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.  స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై అదేప‌నిగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. ఆ వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరేలా తాజా ఉదంతం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బీజేపీ డౌన్ ఫాల్ కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగే ఎన్నిక‌లు స్ప‌ష్టం చేస్తాయ‌ని చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ప్ర‌జ‌ల్లో ఎంపీ స‌ర్కార్ నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత మంట పుట్టించేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. పోయే కాలం ద‌గ్గ‌ర ప‌డితే ఎవ‌రు మాత్రం బాగు చేయ‌గ‌ల‌రు?


Tags:    

Similar News