అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రికార్డ్ సృష్టించారు. కొత్త బడ్జెట్ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో - అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. సెనేట్ ద్రవ్య వినమయ బిల్లుకు ఆమోదం తెలపని కారణంగా ఫెడరల్ ఆఫీసులన్నీ మూసివేతకు గురయ్యాయి. ప్రభుత్వానికి చేయూతనిచ్చే నిధులకు సంబంధించిన బిల్లుకు డెమోక్రాట్లు అడ్డుతగిలారు. ఆ బిల్లు ఆమోదానికి కావాల్సిన 60 ఓట్లు.. ట్రంప్ ప్రభుత్వానికి దక్కలేదు. ఈ నేపథ్యంలో అనేక ప్రభుత్వ ఆఫీసులు తమ కార్యాలయాలను మూసివేతకు గురయ్యాయి. ఇలా అమెరికా చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది.
గత కొన్ని రోజులు అమెరికా ప్రభుత్వం పాక్షికంగా స్తంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రతిష్టంభన 22 రోజులకు చేరుకుంది. ఇంత సుదీర్ఘ కాలం ప్రభుత్వం స్తంభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. షట్ డౌన్ వల్ల కొంత మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. వాస్తవానికి ఈ వారమే కొంత మందికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే వారికి పేస్లిప్స్ అందాయి కానీ జీతాలు మాత్రం ప్రభుత్వం చెల్లించలేకపోయింది. ద్రవ్య బిల్లుకు అనుమతి దక్కితేనే ఆ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ బోర్డర్ వాల్ కు నిధులు కేటాయించకుండా.. ద్రవ్య బిల్లుకు అనుమతి ఇచ్చేది లేదని ట్రంప్ తీర్మానించిన విషయం తెలిసిందే. సుమారు 8 లక్షల మంది ఉద్యోగులకు ఈ నెల జీతం అందలేదు.
ఇదిలాఉండగా - ప్రభుత్వ ఆఫీసులు మూసివేసినా.. అనేక ఎమర్జెన్సీ సర్వీసులు యధావిధిగా సాగనున్నాయి. జాతీయ భద్రత - పోస్ట్ - ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ - మెడికల్ సర్వీసులు కొనసాగనున్నాయి. కేవలం ఎమర్జెన్సీ వర్కర్లకు మాత్రమే జీతం ఇస్తారు. నేషనల్ పార్క్‌లు - మాన్యుమెంట్లు మూసివేశారు.మెయింటెనెన్స్ - ట్రైనింగ్ - ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ నిలిచిపోనున్నాయి. ఒకవేళ డెమోక్రాట్లతో డీల్ కుదరకపోతే, ప్రభుత్వాన్ని నడిపేందుకు ట్రంప్ భిన్న ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది. వీసా - పాస్ పోర్ట్ ప్రాసెసింగ్ కూడా జాప్యం జరిగే ఛాన్సుంది.
కాంగ్రెస్(సేనేట్ - హౌజ్ ఆఫ్ కామన్స్) - వైట్ హౌజ్ లో ట్రంప్ ప్రభుత్వం కంట్రోల్ లో ఉన్నా.. షట్ డౌన్ లాంటి పరిస్థితిని ట్రంప్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నాయి. డెమోక్రటిక్ సేనేటర్లు ఉన్న రాష్ర్టాల్లో .. ట్రంప్ నిర్ణయాలు మరింత కఠినమైన పరిస్థితుల్ని తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది నవంబర్ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లకు షట్ డౌన్ అంశం శరాఘాతంగా మారే ఛాన్సుంది.