ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. శనివారం కూడా అదే జోరు కొనసాగింది.
తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81763 టెస్టులు చేయగా దాదాపు 8వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కు పెరిగాయి.
ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 58గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5302కు పెరిగింది. అనంతపురంలో 477, చిత్తూరులో 736, తూర్పు గోదావరిలో 1395, గుంటూరులో 471 కేసులు వెలుగుచూశాయి.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు భారీగా నమోదయ్యాయి. శనివారంతో తూ.గోదావరిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకంగా 1395 కేసులు నమోదయ్యాయి.