ప్రపంచాన్ని భయంతో వణికిస్తోన్న కరోనా వైరస్ భారీ నుండి ..కరోనాని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా కోలుకుంది. కరోనా వైరస్ తోలి కేసు నమోదు అయిన చైనాలో వుహాన్‌లో ..ఇప్పుడు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీన్ని బట్టే చెప్పవచ్చు కరోనా పై చైనా విజయం సాధించింది అని, మొత్తంగా కరోనా వైరస్ నిర్ధారణ అయినవారిలో 89 శాతం కోలుకున్నట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సోమవారం వెల్లడించింది.
గతేడాది డిసెంబరు చివరి వారం నుండి ఇప్పటివరకు మొత్తంగా 81,093 కేసులు నమోదయ్యాయని, వీరిలో 72,703 మంది కోలుకుని , హాస్పిటల్ నుండి ఇళ్లకు వెళ్లారని తెలిపింది. ప్రస్తుతం కేవలం 5,120 మంది మాత్రమే హాస్పిటల్స్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని , వీరిలో 1,749 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉందని తెలిపింది. మార్చి 22 అర్ధరాత్రి 12 గంటల వరకు మొత్తం 81,093 కేసులు నిర్ధారణ కాగా, 3,270 మంది మృతి చెందినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు.
చైనాలో ఆదివారం 39 కేసులు నమోదు కాగా, వీరంతా విదేశాల నుంచి వచ్చిన చైనా పౌరులేనని తెలిపింది. బీజింగ్‌లో 10, షాంఘైలో 13 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజుల నుంచి కొత్తగా వైరస్ బారినపడ్డ స్థానికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు చైనా తెలిపింది. ఈ నెల 10న వూహాన్ లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్ ను తాము జయించినట్టేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై హుబేయ్, వూహాన్ ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ప్రారంభం అయింది. సరిహద్దులను తిరిగి తెరిచి రాకపోకలకు అనుమతించారు. ప్రావిన్స్ పరిధిలోని లోరిస్క్ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునేందుకు, పనులకు వెళ్లేందుకు, ప్రజలు బయట తిరిగేందుకూ అనుమతించారు. అయితే,ఇదే సమయంలో చైనాను మరో భయం కూడా వెన్నాడుతోంది.
చైనాకు రోజుకు 20 వేల మంది వివిధ దేశాల నుంచి వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ కాగా.. అతడి నుంచి మరో వ్యక్తికి వైరస్ సోకింది. డొమినితో వైరస్ ను నిరోధించడానికి చైనా అత్యంత కఠినమైన చర్యలు చేపట్టింది. దీనితో విదేశాల నుండి వచ్చేవారికి కరోనా ఉంటే , మళ్లీ కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం వుంది. దీనితో బీజింగ్ సహా అన్ని విమానాశ్రయాలకు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలన్న ఆదేశాలు జారీ చేసి, అందుకోసం కొన్ని హోటల్స్‌ను క్వారంటైన్ కేంద్రాలుగా చైనా మార్చేసింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలను దాటగా, మృతుల సంఖ్య 14,688కు చేరుకుంది. 171 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించగా, చైనా తరువాత ఇటలీ, ఇరాన్ దేశాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది.