95 ఏళ్ల రీనా వర్మ 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్ లోని తన ఇంటికి వెళ్లారు..: అసలు కథ ఇదీ..

Update: 2022-07-23 00:30 GMT
95ఏళ్ల రీనావర్మకు చివరి కోరిక తాను పుట్టిని ఇంటిని చూడాలని. ఆ ఇల్లు ప్రస్తుత పాకిస్తాన్ లోని రావల్పిండిలో ఉంది. ఆమె మాత్రం ఇండియాలో నివసిస్తోంది. తన ఇంటిని చూడాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె దరఖాస్తును రిజెక్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చెప్పారు. చివరికి ప్రభుత్వం ఆమె సొంత ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. మొత్తానికి తన ఇంటికి వెళ్లిన రీనా వర్మ ఎలా ఫీలయింది..? ఇంతకు ఆ ఇల్లు ఎలా ఉంది..? అక్కడి ప్రజలు ఏ విధంగా స్పందించారు...?

భారత్,పాకిస్తాన్ దేశాలు ప్రస్తుతం వేర్వేరుగా ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి భారత్ లో పాకిస్తాన్ భాగమే అన్న విషయం తెలుసు. ఆ సమయంలో ఆ భూభాగం నుంచి ఇక్కడికి కొందరు రాకపోకలు సాగించేవారు. బంధుత్వాలు కొనసాగించేవారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్, పాకిస్తాన్ విడిపోయాయి. ఆ తరువాత జరిగిన పరిణామాలతో రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. అయితే భారత్ విభజన సమయంలో కొందరు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నవారు భారత్ కు వలస వచ్చారు. ఆ తరువాత ఇక్కడే ఉండిపోయారు. అలాంటి వాళ్లల్లో రీనా వర్మ ఒకరు.  

ఉమ్మడి భారత విభజన సమయంలో పంజాబ్ ప్రాంతంలో రక్తం ఏరులై పారింది. మతపరమైన అల్లర్లు చెలరేగడంతో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి సరిహద్దులు దాటారు. అలా రీనావర్మ తన ఇంటిని విడిచిపెట్టారు. అయితే 75 ఏళ్ల కాలం గడిచిన తరువాత తాను పుట్టిన ఇంటిని చూడాలన్న తపన ఏర్పడింది.

దీంతో ఆమె 2021లో ఓ ఇంటర్వ్యూలో తన కథను చెప్పారు. అప్పటి నుంచి రీనా వర్మ పాపులర్ అవుతూ వస్తున్నారు. ఈ తరుణంలో ఇండియా, పాకిస్తాన్ హెరిటేజ్ క్లబ్ అనే ఫేస్ బుక్ గ్రూపులోని కార్యకర్తలు రావల్పిండిలోని ఆమె పూర్వీకుల ఇంటి కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి ఓ మహిళా జర్నలిస్టుల ఇంటిని కనుగొన్నారు.

అయితే గతేడాది కరోనా నిబంధనల కారణంగా పాకిస్తాన్ వెళ్లలేకపోయారు. ఈ ఏడాది మార్చిలో ఆమె పాకిస్తాన్ వెళ్లడానికిదరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఎలాంటి కారణాలు చూపకుండా దానిని తిరస్కరించారు. అయితే మరోసారి దరఖాస్తు పెట్టుకుందామనుకున్నారు. కానీ ఈ విషయం మంత్రి తెలియడంతో ఆయన వెంటనే దరఖాస్తును ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కు ఆదేశాలిచ్చారు. దీంతో ఆమెకు వీసా వచ్చింది. దీంతో తన పుట్టింటికి వెళ్లేందుకు రీనా సిద్ధమయ్యారు.

కానీ ఆమె ఇంటికి వెళ్లడనికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వేసవి కాలంలో ఆమె కొడుకు మరణించారు. దీంతో ఆమె ఒంటరిగానే మిగిలిపోయింది. కొన్ని నెలలు ఆగాక వెళ్దామని నిర్ణయించుకున్నారు. చివరికి ఈ జూలై 16న ఆమె రావల్పిండిలోని కాలేజీరోడ్డులో తన ఇంటిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మీయులు రీనా వర్మకు గులాబీ పూలతో స్వాగతం పలికారు. రావల్పిండిలోని తన ఇంటిని చూసిన రీనా వర్మ కొత్తగా ఫీలయ్యారు.  ఆ ఇల్లు అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. సున్నాలు మాత్రమే వేశారు.
Tags:    

Similar News