దేశీగా పుట్టి విదేశీగా పెద్దదై.. దేశీ అయిన బామ్మ

Update: 2015-12-20 04:15 GMT
కొన్ని జీవితాలు చాలా .. కానీ చివరకు మాత్రం సిత్రంగా ఉంటాయి. మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే.. తమకేమాత్రం సంబంధం లేకుండానే వారి జీవితాల్లో ఇలాంటి విచిత్రాలు చోటు చేసుకుంటాయి. పుట్టింది ఒక దేశంలో.. పెరిగింది.. పెద్దదైంది మరో రెండు దేశాల్లో ఉండి.. తాజాగా దేశీగా మారిపోయిన ఈ బామ్మ.. ఇదంతా ఇల్లు కదలకుండా.. ఊరు దాటకుండానే ఈ ఘనత మూటగట్టుకోవటం గమనార్హం.

అమర్త్య బర్మన్ కు 95 ఏళ్లు. ప్రస్తుతం భారతీయురాలిగా ఉన్న ఆమె జీవితంలో బోలెడన్ని ట్విస్ట్ లు. ఆమెకు సంబంధం లేకుండా.. ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే ఇప్పటికి ఆమె పౌరసత్వంమూడుసార్లు మారిపోయింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఈ మూడు దఫాలు ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోవటం గమనార్హం.

అమర్త్య బర్మన్ అసోంలోని సరిహద్దు ప్రాంతంలో ఉండేవారు. ఆమె పుట్టేనాటికి దేశంలో తెల్లోళ్ల పాలన జరుగుతుండేది. అనంతరం కొద్దిరోజులకు భారత్ కు స్వాతంత్ర్య వచ్చింది. కాకుంటే.. దేశ విభజన పుణ్యమా అని ఆమె ఉన్న ఊరు పాక్ లోకి వెళ్లిపోయింది. కొద్దికాలానికే పాక్ లో చోటు చేసుకున్న సివిల్ వార్ కారణంగా..పాక్ రెండు ముక్కలై.. అందులో ఒకటి బంగ్లాదేశ్ గా మారిపోయింది. బర్మన్ నివసిస్తున్న గ్రామం బంగ్లాదేశ్ లో భాగమంది. ఇదిలా ఉండగా.. తాజాగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది.

దీని ప్రకారం.. భారత్.. బంగ్లాదేశ్ ల మధ్య కొంత భూభాగం రెండు దేశాలు బదలాయించుకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అమర్త్య బర్మన్ మరోసారి భారతీయురాలిగా మారిపోయారు. ఈ సందర్భంగా ఆమె విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తాను.. తన మాతృభూమికి తిరిగి వచ్చేయటంపై విపరీతంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. తిరిగి తాను తన మాతృదేశానికి వచ్చినట్లు పేర్కొంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. పుట్టిన నాటి నుంచి తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా వివిధ దేశాల పౌరురాలైన ఆమెకు.. ఇప్పటివరకూ ఏ దేశ పౌరసత్వం లేకపోవటం మరో విశేషం. తాజాగా భారత దేశ మహిళగా ఆమెకు పౌరసత్వం ఇవ్వనున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు.. ప్రభుత్వం తరఫున అందాల్సిన సాయాలు అందిస్తే మరింత బాగుంటుంది.
Tags:    

Similar News