లేటెస్ట్ అప్డేట్ : ఏపీలో ఈ రోజు ఎన్ని కేసులంటే ?

Update: 2020-06-04 08:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో వైరస్ జోరు తగ్గడంలేదు. రోజురోజుకి మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే, ఏపీ ప్రభుత్వం కూడా ఏమాత్రం అలసత్వం వహించకుండా రోజురోజుకి వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్యను కూడా పెంచుతుంది. ప్రతి రోజు పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. తాజాగా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య  నాలుగు లక్షల మార్కును దాటింది. కానీ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

తాజాగా గత 24 గంటల్లో 9986 శాంపిల్స్ టెస్ట్ చెయ్యగా... కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3377కి చేరాయి. ఇక ఇందులో 2277 మంది డిశ్చార్జి అయ్యారు. 71 మంది మరణించారు. ఇప్పుడు యాక్టివ్ కేసులు 1033గా ఉన్నాయి. గత 24 గంటల్లో వైరస్ నుంచి 29 మంది కోలుకున్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 19 మంది కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చిన వారని  ప్రభుత్వం వెల్లండించింది. దేశాల నుంచి వచ్చిన వారు 119 కాగా..ఇందులో 115 యాక్టివ్ కేసులు కాగా..ముగ్గురు డిశ్చార్ కానున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 616 మందికి వైరస్ సోకగా..యాక్టివ్ కేసులు 372 కాగా..33 మంది డిశ్చార్జ్ కానున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 700పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News