తన వయసు 30 ఏళ్లేనంటూ మేకప్ తో ఓ యువకుడిని పెళ్లి చేసుకున్న 54 ఏళ్ల ఆంటీ బాగోతమిది. యువకుడి ఆస్తిని తన పేరిట రాయాలని వేధిస్తుండటంతో పోలీసు కేసు పెట్టడంతో ఆంటీ అసలు వయసు బాగోతం వెలుగుచూసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుత్తూరులో కలకలం రేపింది.
ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. చెన్నై ఆవడి సమీపంలోని ముత్తు పుదుపేట రాజీవ్‌నగర్‌కు చెందిన హరి (44) ఎంసీఏ పూర్తి చేసి చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రెండవ వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశాడు. ఆ సమయంలో ఆమె తనకు 35 ఏళ్లు అని, బంధువులు ఎవరూ లేరని చెప్పింది.
దీంతో హరి.. శరణ్యను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. హరి ఆస్తి వివరాలను తనతో చెప్పాలని హరితో శరణ్య తరచూ ఘర్షణ పడేది. ఆస్తులను తనపై పేరుపై రాసి పెట్టాలని గొడవ పడేది. చివరికి వరకట్న వేధింపులు గురి చేస్తున్నారని భర్త, అత్త ఇంద్రాణిపై తిరుపతి పోలీసులకు శరణ్య ఫిర్యాదు చేసింది. దీంతో హరి తల్లి ఇంద్రాణి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు శరణ్య టార్చర్ భరించలేక హరి ఆస్తిని ఆమె పేరుతో బదలాయించడానికి ఆమె ఆధార్ కార్డు తీసుకున్నాడు. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆధార్ కార్డులో ఆమె భర్త పేరు ఉంది. వయసు కూడా 54 అని ఉంది.
దీంతో తాను మోసపోయానిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా శరణ్య నిజమైన పేరు సుగణ అని ఈమెకు 54 ఏళ్లని తేలింది. ఈమెకు ఇది వరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలున్నట్లు తెలిసింది. ఆ కుమార్తెలిద్దరకు కూడా పెళ్లియిందని వెల్లడైంది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
కాగా తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి కూడా ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. 2010లో ఆరణికి చెందిన ఏజెంట్ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగిందని పేర్కొన్నాడు. తనకు ఆమె పేరును సంధ్య అని తెలిపిందన్నారు.
గత పదేళ్లు శరణ్యతో తాను జీవించానని, తమకు పిల్లలు లేరని తెలిపాడు. 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్‌లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు శరణ్య మూడు పెళ్లిళ్లు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.