ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీకి చేదు అనుభవం

Update: 2020-01-09 08:49 GMT
30ఇయర్స్ ఇండస్ట్రీ  అంటూ సినిమాల్లో తనదైన శైలిలో కామెడీ పండించి.. అనంతరం వైసీపీలో చేరి కీలకనేతగా ఎదిగారు సినీ నటుడు ఫృథ్వీ.. మొన్నటి ఎన్నికల వేళ జగన్ గెలుపు కోసం పాటుపడ్డారు. అందుకే జగన్ గెలిచాక ఫృథ్వీకి ఏకంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి అగ్రతాంబూలం ఇచ్చారు.

తాజాగా ఎస్వీబీసీ చైర్మన్, నటుడు ఫృథ్వీకి తిరుపతి సమీపాన గల రేణిగుంట ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. తనకు ఈ పదవి ఇచ్చి అందలం ఎక్కించిన జగన్ కు స్వాగతం పలకడానికి  వెళ్లిన  ఫృథ్వీకి  రేణిగుంట విమానాశ్రయంలో చుక్కెదురైంది.

చిత్తూరు జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి  చేరుకున్నారు. ఈ క్రమంలోనే  సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వైసీపీ నేత ఫృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో విమానాశ్రయం  లోపలికి  వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు ఎయిర్ పోర్టు సిబ్బంది అభ్యంతరం తెలిపారు.

దీంతో లోపలికి వెళ్లలేక.. ఎయిర్ పోర్టు సిబ్బందిని ఏమీ అనలేక ఫృథ్వీ తీవ్ర మనస్థాపం చెందినట్టు తెలిసింది. అయితే ప్రొటోకాల్ ప్రకారం లిస్ట్ లో ఫృథ్వీ పేరు లేకపోవడంతోనే ఆయనను సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదని తెలిసింది.


Tags:    

Similar News