కంపెనీని వీడిపోయే ఉద్యోగులకు మన దేశంలో ఎంతటి ఛీత్కారాలు.. జీతాలు ఎగ్గొట్టాడు చేస్తారో మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ కంపెనీ మాత్రం వెళ్లిపోయే ఉద్యోగి జీతాన్ని 10 శాతం పెంచి .. వారికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోంది. ఇది ఎందుకు చేస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాలో ఓ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ఈ వింత విధానం ప్రవేశపెట్టింది. కొత్తతరం అభిరుచికి అనుగునంగా తాము ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని గొరిల్లా అనే మార్కెటింగ్ కంపెనీ సీఈవో తెలిపారు.
రాజీనామా చేయబోతున్న ఓ ఉద్యోగి కనీసం ఆరువారాల ముందు నోటీసు ఇస్తే అతడి జీతం 10శాతం పెంచి సకల సౌకర్యాలు కల్పిస్తామని.. మూడు నెలల్లోగా కంపెనీ వీడేలా చేస్తామంటూ తెలిపింది. కొత్త ఉద్యోగుల అభిరుచికి తగ్గట్టుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు.
మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఈ కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. ఉద్యోగులను వదిలించుకోవడానికి తాము సిద్ధంగా లేమని.. మంచిగా పనిచేసేవారు.. నిబద్దత కలిగిన వారు మార్కెట్లో దొరకడం లేదని.. అందుకే ఉన్నవారిని కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నట్టు తెలిపింది.
ఇక కంపెనీ ఇలా రిటైర్ అయిపోయే వారికి కల్పిస్తున్న సౌకర్యాలు చూసి ఇలాంటి కంపెనీ తమకు కావాలని.. 18 గంటలైనా సరే తాము పనిచేస్తామంటూ చాలా మంది ముందుకు వస్తున్నారట.. ఇంతటి ఆదరణ ఇచ్చే కంపెనీని వీడి వెళ్లమని కూడా ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఉద్యోగులను కడుపులో పెట్టుకుంటే.. వారే కంపెనీని కాపాడుతారని ఆ సంస్థ వేసిన ఎత్తుగడ ఫలితాన్ని ఇస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.