అయ్యయ్యో..హర్భజన్ కు ఎంత కష్టం!

Update: 2020-09-10 14:00 GMT
ఎవరికైనా డబ్బు అప్పు గానో, చేతి బదులు గానో ఇచ్చే ముందు కాస్త ముందు వెనకాలా అలోచించి ఇచ్చేది మేలు. లేదంటే నిండా మోసపోడం ఖాయం. ఇప్పుడంతా జనాలు ఎలా వున్నారంటే.. కాస్త ఉన్నోళ్లు పరిచయం అయితే చాలు. వారిపై ఎక్కడ లేని ప్రేమ చూపుతారు. విందులు, వినోదాలంటూ దగ్గర అవుతారు. అదును చూసి ఏదోఒక బలమైన సాకు చెప్పి అప్పుగానో, వడ్డీకని చెప్పో భారీగా డబ్బు కావాలని అడుగుతారు. ఇక నమ్మి ఇచ్చామా.. అంతే సంగతులు.. అప్పటి వరకూ మన వెంట తిరిగిన వాళ్ళ కోసం మనం తిరగాల్సి వస్తుంది.

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇలా ఓ వ్యక్తికి భారీ మొత్తంలో అప్పు ఇచ్చి మోసపోయాడు. తీసుకున్న వ్యక్తి ఎంతకూ తిరిగి ఇవ్వక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. 2015లో హర్భజన్ సింగ్ కు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నై కి చెందిన మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. అతడు భజ్జీతో చాలా సన్నిహితంగా మెలిగేవాడు. అవసరం ఉందంటూ అతడు హర్భజన్ వద్ద నుంచి రూ. 4 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరినా మహేష్ స్పందించక పోవడంతో తాను మోసపోయినట్లు భజ్జీ గ్రహించాడు. చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మహేష్ పై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి హర్భజన్ సింగ్ వైదొలిగాడు. దీంతో తనకు రావాల్సిన రూ. 2 కోట్ల ఫీజును కోల్పోయాడు. ఇలా రెండు విధాలా హర్భజన్ కు నష్టమే వాటిల్లింది.
Tags:    

Similar News