తమకు తాము సరికొత్త ఇమేజ్ ను తెచ్చుకోవటానికి కొన్ని వ్యాపార సంస్థలు చాలానే ఎత్తులు వేస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే చెన్నైలో చోటు చేసుకుంది. తమ షాపు ప్రచారం కోసం కావొచ్చు.. నిజంగానే పేదలకు చౌక ధరకు బట్టలు అందించాలన్న ప్రయత్నం కావొచ్చు కానీ.. చెన్నైలోని ఒక వస్త్ర సంస్థ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఆ షాపు ముందు తెల్లవారుజామునే క్యూ కట్టే పరిస్థితి నెలకొంది.
దీపావళి సందర్భంగా తక్కువ ధరకే ప్రజలకు వస్త్రాల్ని అందించాలని నిర్ణయించిన ఒక సంస్థ వినూత్న ఆఫర్ కు తెర తీసింది. చెన్నైలోని చాకలిపేటలో ఆనంద్ అనే వ్యక్తికి చెందిన బట్టల షాపు ఉంది. దీపావళి సందర్భంగా అతడు ఈ నెల 19 నుంచి 26 వరకు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో రూపాయికే చొక్కా.. పది రూపాయిలకే నైటీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ప్రతి రోజు యాభై మందికి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో.. ఈ ఆఫర్ కు భారీ స్పందన వచ్చింది. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టేస్తున్నారు. కిలోమీటరకు పైనే ఉన్న ఈ క్యూ అతడ్ని ఆలోచనలో పడేసి.. రోజుకు యాభై మంది కాదు 200 మందికి తమ ఆఫర్ అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. భారీగా లబ్థి పొందటమే కాదు.. షాపులో ఇచ్చే ఆఫర్ ను సొంతం చేసుకోవటానికి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మిగిలిన వ్యాపార లెక్కలు ఎలా ఉన్నా.. ఈ ఆఫర్ మాత్రం ఆ షాపు ఇమేజ్ ను అమాంతం పెంచేసిందంటున్నారు.