బయటపడ్డ తబ్లీఘీ జమాత్ కి సంబంధించిన ఓ క్రైమ్ కోణం !

Update: 2020-06-04 07:30 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలో వివాదాస్పద తబ్లీఘీ జమాత్ కి సంబంధించిన ఓ క్రైమ్ కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల పై దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా ఓ ఛార్జి షీట్ దాఖలు చేయగా..ఈ సంస్థ బండారం కూడా బయటపడింది.

తబ్లీఘీ జమాత్ ప్రధాన కార్యాలయం ‘జామియా మిలియా ఇస్లామియా’ కి చెందిన జామియా కో-ఆర్డినేషన్ కమిటీతోను, మహిళా కళాశాలల విద్యార్థినుల హక్కులకోసం పోరాడే ఓ సంస్థ తోను ప్రమేయమున్న ఫైసల్ ఫరూఖీ అనే వ్యక్తి ఈ అల్లర్లకు కుట్ర చేసినట్టు పోలిసుల దర్యాప్తులో తేలింది. గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో ఒక స్కూలు, ఓ స్వీట్ షాపు తగులబడడానికి. ఓ వ్యక్తి సజీవ దహనం కావడానికి కారణం కూడా ఈ ఫరూఖీయే.

తాను నిర్వహిస్తున్న ఓ స్కూలు పక్కనే ఉన్న మరో పాఠశాలను. అక్కడే ఉన్న స్వీటు షాపును ఇతని సహచరులు తగులబెట్టారని, ఇతని స్కూలు టెర్రేస్ పై నుంచి కాల్పులు జరపడమే కాక, యాసిడ్, ఇటుకలు విసిరారని తెలిసింది. ఈ ఘటనలో మిఠాయి దుకాణంలో చిక్కుబడిన ఓ వ్యక్తి మంటల్లో సజీవ దహనమయ్యాడని తెలుస్తోంది. ఢిల్లీ నగరంలో ఘర్షణలు, అల్లర్లను రెచ్చగొట్టేందుకు ఫరూఖీ, అతని సహచరులు ఇలా ముందే పకడ్బందీ ప్లాన్ వేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 18 మందిపై కేసు పెట్టారు.
Tags:    

Similar News