పని చేసే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. కొందరు పని చేసి మెప్పు కోసం చూస్తుంటారు. మరికొందరు తాము చేయాల్సిన పనిచేసి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరికొందరు ఏ పని చేయకపోయినా కూడా అంతా మేమే చేశాం అన్నంతగా బిల్డప్ కొడుతుంటారు. కానీ , ఈ మహిళ ఇందులో ఏ రకానికి కూడా చెందినది కాదు. ఎందుకంటే .. తాను చేసిన పని ఎంత ఖచ్చితంగా ఉంటుందో చూపించడానికి ఏకంగా టాయిలెట్ సింక్ లోని వాటర్ తీసుకోని ఎంచెక్కా గుటగుట తాగేసింది.
చైనాలోని షాంగ్‌డాంగ్‌లో గల ఓ ఫెర్టిలైజర్ కంపెనీలో క్లీనర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ.. తన పనితీరును నిరూపించుకోడానికి ఏకంగా టాయిలెట్ గుతంలో ఉండే నీటినే తాగేసింది. తాను టాయిలెట్లను ఎంతో శుభ్రంగా ఉంచుతానని చెబుతూ.. చిన్న గ్లాసును టాయిలెట్ గుంతలో ముంచింది. అనంతరం ఆ నీటిని తీసుకుని గడగడా తాగేసింది. ఆమెను అలా చూడగానే బాస్, ఇతరాత్ర సిబ్బంది షాకయ్యారు. ఆమెను అలానే చూస్తుండిపోయారు. ఆ వెంటనే చప్పట్లు కొట్టి ఆమె పనితీరును మెచ్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైనా సోషల్ మీడియాతో పాటు ట్విట్టర్, యూట్యూబ్ లలో సైతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజనులు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. ఆమె డెడికేషన్ ను కొంతమంది మెచ్చుకుంటుంటే.. కొందరు మాత్రం అంతా చేయాల్సిన అవసరం లేదు. ఆ కప్పులో క్లీన్ గా కనిపిస్తున్న నీటిని చూపిస్తే సరిపోయేదని అంటున్నారు. ఇంకొందరైతే.. ఆ బాసులు కూడా కాస్త రుచి చూసి ఉంటే ఇంకా బాగుండేదని, ఆమె పనితీరును మరింత లోతుగా తెలుసుకొనేవారని అంటున్నారు. ఏదేమైనా పనిలో ఆ లెవెల్ డెడికేషన్ అవసరమే కానీ, మరి ఆ నీళ్లు తాగాల్సిన అవసరం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.