కరోనాతో భర్త - మామ భాదతో అత్త మృతి..ఒంటరిగా మారిన గర్భిణీ!

Update: 2020-07-18 10:10 GMT
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తూ ఎంతోమంది ప్రాణాలని బలి తీసుకుంటుంది. అప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు సైతం కరోనా భారిన పడి ..చికిత్స తీసుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నారు. దీనితో వారి కుటుంబ సభ్యులకి తీరని శోకం మిగులుతుంది. ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది తమ కుటుంబ సబ్యులని కోల్పోయి భాదతో కుమిలిపోతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ నిండు గర్భిణీకి జరిగిన విషయం తెలుసుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెడుతున్నారు. అటువంటి భాద ఈ లోకంలో ఎవరికీ రావొద్దు అని కోరుకుంటున్నారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. వరంగల్ లోని ఓ కార్యాలయంలో ఆ యువతి ఉద్యోగం చేస్తుండేది. అదే కార్యాలయంలో పనిచేసే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా త్వరలో వారింట్లో బుడిబుడి అడుగులు అడుగులు వేయడానికి ఓ శిశివు రాబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే , వారి సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. తీవ్ర జ్వరంతో పాటు కరోనా లక్షణాలు కనిపించడంతో భర్తకు 2020, జులై 02వ తేదీన పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీనితో వరంగల్ MGM ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆ తరువాత అక్కడి నుండి హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే..యువకుడి తండ్రికి కూడా కరోనా సోకింది. ఆయన్ని వరంగల్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి..2020, జులై 10వ తేదీ శుక్రవారం మరణించారు. భర్త చనిపోయాడని తెలుసుకుని యువకుడి తల్లి మానసికంగా బాధ పడి 2020, జులై 12వ తేదీ ఆదివారం ఆమె చనిపోయింది. ఓ వైపు భర్త ఆసుపత్రిలో..మరోవైపు అత్తామామలు చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది గర్భిణీ. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న భర్త…2020, జులై 16వ తేదీ గురువారం చనిపోయాడు. అప్పటికే తీవ్ర దు:ఖంలో ఉన్న ఆమె..భర్త లేడనే విషయం తెలుసుకుని కుప్పకూలిపోయింది.ఇలా కొన్ని రోజుల ముందు వరకు ఎంతో సంతోషం గా ఉన్న వారి కుటుంబం .. కరోనా దెబ్బకి చిన్నాభిన్నం అయింది.
Tags:    

Similar News